AP Polling: ప్రశాంతంగా కొనసాగుతున్న ఏపీ పోలింగ్.. బారులు తీరిన జనం..

Andhra Pradesh 175 Assembly , 25 Lok Sabha constituencies ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకు Polling ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు Polling జరగనుంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం ఉంది. అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు Polling ముగియనుంది. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో Polling ముగియనుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AP లో 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు ఉన్నారు. 46 వేల 389 Polling centers ఉన్నాయి. 12 వేల 438 సమస్యాత్మక Polling కేంద్రాలను గుర్తించారు. 34 వేలకు పైగా Polling centers సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె వంటి 14 సమస్యాత్మక నియోజకవర్గాల్లో వంద శాతం వెబ్కాస్టింగ్ జరుగుతోంది. command control room లో webcasting ద్వారా Polling centers ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.