AP Mega Job Mela 2025: గుడ్ న్యూస్.. మెగా జాబ్‌ మేళా.. టెన్త్‌ పాసైనా చాలు! జాబ్‌ గ్యారెంటీ

10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ ఉత్తీర్ణత సాధించి మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువత కోసం మే 3న ఏపీలోని నిడదవోలులో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్నవారు తమ సర్టిఫికెట్లతో నేరుగా కింది చిరునామాకు రావాలని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

నిడదవోలు నియోజకవర్గంలోని యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సోమవారం (ఏప్రిల్ 28) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాను మే 3న ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జాబ్ మేళాలో భాగంగా 1302 మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని ఆయన అన్నారు. రూ. 12,000 నుంచి రూ. 40,000 వరకు జీతం పొందవచ్చని ఆయన అన్నారు.

ఇసుజు, ఎల్ అండ్ టి కన్స్ట్రక్షన్, జిఎంఆర్ కార్గో, పానసోనిక్, హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్, అపోలో ఫార్మసీ, ఐసన్ ఎక్స్‌పీరియన్స్, స్మార్ట్ బ్రెయిన్స్, సాండ్ స్పేస్ టెక్నాలజీస్, డెలాటేకర్ కార్పొరేట్, సదర్లాండ్, సినర్జీ, ఇఎస్‌ఎఎఫ్, స్పందన, ముత్తూట్ ఫైనాన్స్, పైసా బజార్, రిసల్యూట్, ఇండస్, ఎంసివి, ఇండో ఎంఐఎం, పిల్కింగ్టన్, ఇన్ఫిలమ్, హెచ్‌డిఎఫ్‌సి, బిఎస్ సిపిఎల్, జిఎల్‌ఆర్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ మరియు ఇతర 45 కంపెనీల ప్రతినిధులు ఈ ఉద్యోగ మేళాకు హాజరుకానున్నారు.

Related News

10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బిటెక్, పిజి ఉత్తీర్ణులై మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. నియోజకవర్గంలోని 35 ఏళ్లలోపు ఆసక్తిగల నిరుద్యోగ యువత మే 3వ తేదీ ఉదయం 9 గంటల నుండి జరిగే ఉద్యోగ మేళాకు తమ బయోడేటా, విద్యార్హతలు మరియు సర్టిఫికెట్లతో హాజరు కావాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు.