ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది. ఏపీపీఎస్సీ మార్చి 27న ప్రిలిమ్స్ నిర్వహించింది.
రికార్డు స్థాయిలో 27 రోజుల్లో ఫలితాలు విడుదల కావడం గమనార్హం. గ్రూప్ వన్ కోసం మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష రాసిన వారిలో 4,496 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.
గతేడాది డిసెంబర్ 08న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో మొత్తం 81 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ 02 మరియు 09 మధ్య మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని APPSC ప్రెస్ నోట్‌లో తెలిపింది.
Related News
పోస్టుల వివరాలు..
AP సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9; పన్నుల అసిస్టెంట్ కమిషనర్ 18; డీఎస్పీ (సివిల్) 26; ప్రాంతీయ రవాణా అధికారి 6; సహకార సేవలలో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 5; జిల్లా ఉపాధి అధికారి 4; జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3; అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు 3; అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2; జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చొప్పున ఒక్కో పోస్టు ఉంది.