GROUP 2 KEY: ఏపీ గ్రూప్-2 మెయిన్స్ ఆన్సర్ ‘కీ’ విడుదల

ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పేపర్-1 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు 175 పరీక్షా కేంద్రాల్లో జరిగాయి. గ్రూప్-2 ప్రిలిమ్స్ లో మొత్తం 92,250 మంది అభ్యర్థులు అర్హత సాధించారని, 92 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇంతలో ఏపీపీఎస్సీ పరీక్ష జరిగిన రాత్రి గ్రూప్ 2 మెయిన్స్ జవాబు కీలను కూడా విడుదల చేసింది. అభ్యర్థుల ప్రతిస్పందన పత్రాలను వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచింది. ప్రశ్నలు, సమాధానాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 25 నుండి 27 వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు తెలియజేయాలని కమిషన్ అభ్యర్థులను కోరింది. ఈ పరీక్షలలో పేపర్ 1 సులభం అని పేపర్ 2 మధ్యస్థ కష్టంగా ఉందని సబ్జెక్ట్ నిపుణులు తెలిపారు. పేపర్ 2లో తాజా పరిణామాలపై ఎకానమీ, సైన్స్, టెక్నాలజీ విభాగాల నుండి ఎక్కువ ప్రశ్నలు అడిగారని వారు చెప్పారు. ఇదిలా ఉండగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వచ్చే నెలకు వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడంతో శనివారం పరీక్షల నిర్వహణపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే.

సమాధాన కీ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.https://portal-psc.ap.gov.in/HomePages/KeysToPapers

Related News