AP government gave good news to the farmers . ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాయిదా వేసిన farmers’ input subsidy నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో జమ చేశారు.
Season ముగియకుండానే ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం పరిహారం అందజేస్తోంది. 2023 ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏపీలోని 103 కరువు మండలాల్లో 14.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.
ఇందుకు సంబంధించి 6.60 లక్షల మందికి రూ.847.22 కోట్లు కరువు సాయంగా అందించారు.
అలాగే గతేడాది రబీ ప్రారంభంలో మిచాంగ్ తుపాను ప్రభావంతో 6.64 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 4.61 లక్షల మందికి పరిహారం కింద రూ.442.36 కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉంది.
గతేడాది ఖరీఫ్, ప్రకృతి వైపరీత్యాలు, రబీ సీజన్లలో కరువుతో నష్టపోయిన రైతుల ఖాతాల్లో గతేడాది డబ్బులు జమ చేసింది.
92 శాతం మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి రాయితీ డబ్బులు జమయ్యాయి. 8.89 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,126.31 కోట్లు జమ అయినట్లు అధికారులు వెల్లడించారు.
మరో 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉంది. త్వరలోనే ఈ మొత్తాన్ని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరుగుతుందని.. వీటిని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.