ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు బకాయిలు విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.6,200 కోట్లు చెల్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీనితో శుక్రవారం ఉద్యోగుల ఖాతాల్లోకి బకాయిలు జమ అవుతాయి.
సంకీర్ణ ప్రభుత్వం పరిపాలనలో దూసుకుపోతోంది. ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందిస్తోంది. ఉద్యోగులను కూడా పరుగులు పెట్టిస్తోంది. సుపరిపాలన అందించడానికి ఉద్యోగుల సేవలను ఉపయోగించుకుంటోంది. అయితే, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విడుదలపై దృష్టి సారించింది. ఆర్థిక శాఖతో చర్చించింది. నిధుల విడుదలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మేరకు అన్నీ సిద్ధం చేసింది.