రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు సంకీర్ణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జీతాలను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం, గంటకు ప్రస్తుతం రూ. 150గా ఉన్న వేతనాన్ని రూ. 375కు పెంచారు.
దీని అర్థం నెలకు గరిష్టంగా 72 గంటలకు రూ. 27,000 చెల్లించాలని నిర్ణయించారు. ఇటీవల విడుదల చేసిన జీవోలో ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోని 475 జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న దాదాపు 1177 మంది గెస్ట్ లెక్చరర్లు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం పొందుతారు. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్ ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకుంటుంది.