ఆంధ్రప్రదేశ్: పల్నాడు జిల్లాలో జరుగుతున్న ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పల్నాడులో పోలింగ్ ప్రారంభానికి ముందు జరిగిన ఘర్షణలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు గొడవపై ఈసీ ఆరా తీసి పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను మోహరించేలా చూడాలని ఆదేశించారు. పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేసి పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని ప్రాంతంలో వదిలేశారని టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.
మే 13: పల్నాడు జిల్లాలో జరుగుతున్న ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పల్నాడులో పోలింగ్ ప్రారంభానికి ముందు జరిగిన ఘర్షణలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు గొడవపై ఈసీ ఆరా తీసి పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను మోహరించేలా చూడాలని ఆదేశించారు. పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేసి పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని ప్రాంతంలో వదిలేశారని టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రా పలనాడు ప్రాంతానికి బయలుదేరారు.
అసలు ఏం జరిగింది..
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడులో వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ తరపున ఏజెంట్ ఫారం ఇచ్చేందుకు వెళ్లిన సుబ్బయ్యపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సుబ్బయ్యను వెంటనే నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. అలాగే అటు మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ దౌర్జన్యానికి దిగింది. రెండు పర్యాయాలు టీడీపీ ఏజెంట్లపై దాడులు జరిగాయి. నలుగురు టీడీపీ ఏజెంట్లను పొట్టన పెట్టుకున్నారు. టీడీపీ ఏజెంట్లుగా మిగిలిపోవద్దని వార్నింగ్ ఇచ్చింది