AP Scheme Names: ఏపీలో పలు పథకాల పేర్లు మార్చిన ప్రభుత్వం, కొత్త పేర్లు ఇవే

అమరావతి: ఏపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాల పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పథకాలకు గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

గత ప్రభుత్వం ఐదేళ్లుగా భ్రష్టు పట్టించిన విద్యావ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.

రాష్ట్రంలోని పాఠశాలలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా మార్చాలన్నదే తమ సంకల్పమని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేర్కొంది.

Related News

ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌ పేరిట ఏర్పాటు చేసిన పథకాల పేర్లను నిలిపివేసినట్లు వెల్లడించారు. విద్యారంగంలో విశేష సేవలందించిన గొప్ప వ్యక్తుల పేర్లను ఈ పథకాలకు పెట్టారు. నేడు దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా కొత్త పథకాల పేర్లను ప్రకటించినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

పథకాలు ప్రస్తుత పేరు – కొత్త పేరు

  • జగనన్న అమ్మ ఒడి – తల్లికి వందనం
  • జగనన్న విద్యా కానుక – సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర
  • జగనన్న గోరు ముద్ద – డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం
  • మన బడి నాడు నేడు – మన బడి – మన భవిష్యత్తు
  • స్వేచ్ఛ – బాలికా రక్ష
  • జగనన్న ఆణిముత్యాలు – అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం