
అమరావతి, జూలై 2: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ తాజాగా విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం జూలై 4 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కన్వీనర్ గణేష్కుమార్ తెలిపారు.
ఈసెట్ కౌన్సెలింగ్ వివరాలు
ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు:
[news_related_post]- జూలై 4 నుంచి 8 వరకు ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- జూలై 4 నుంచి 9 వరకు ఆన్లైన్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
- జూలై 7 నుంచి 10 వరకు కాలేజీలు, కోర్సుల ఎంపికకు వెబ్ఐచ్ఛికాలను (Web Options) ఎంపిక చేయాల్సి ఉంటుంది.
- జూలై 11న ఐచ్ఛికాల మార్పుకు అవకాశం ఇస్తారు.
- జూలై 13న సీట్ల కేటాయింపు ఉంటుంది.
- సీట్లు పొందిన విద్యార్థులు జూలై 14 నుంచి 17లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
ఇక జూలై 14 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. కాగా, డిప్లొమా, బీఎస్సీ (గణితం) డిగ్రీ విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ సెకండియర్లో చేరేందుకు మే 6వ తేదీన ఈసెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసెట్ ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది మొత్తం 35,187 మంది హాజరు కాగా, అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు.
సీయూఈటీ యూజీ 2025 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల
వివిధ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ 2025) పరీక్ష తుది కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ప్రశ్న ఐడీతో కూడిన కీని వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మే 13 నుంచి జూన్ 4వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లో 2025-26 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.