కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో 10వ తరగతి విద్యార్థి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
విద్యార్థిని తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమైన విద్యార్థిని ఉదయం లేచినప్పటి నుంచి తన పనులు ముగించుకుని బడికి వెళ్లేందుకు సిద్ధమైంది.
ఏం జరిగిందో తెలియక తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, ఇంటి బయట విగతజీవిగా పడి ఉన్న కూతురిని చూసి ఏం చేయాలో తోచలేదు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాలికను పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.