AP Cabinet Meeting: ఏపీ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఇప్పటికే పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. అమరావతిలో రూ.కోటితో చేపట్టనున్న పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2,733 కోట్లు, అలాగే సీఆర్డీఏ 44వ సమావేశంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపల్ చట్టం సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం కూడా లభించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

భవన నిర్మాణాలు, లేఅవుట్ అనుమతులు ఇచ్చే అధికారం మున్సిపాలిటీలకు ఇచ్చే అంశంపై సమావేశంలో చర్చించారు. ఈ అంశాన్ని పరిశీలించిన మంత్రివర్గం చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. పిఠాపురం ఏరియాలో కొత్తగా 19 పోస్టులు సృష్టించాలని నిర్ణయించారు.

వీటితో పాటు రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు వంటి ప్రాజెక్టులపైనా చర్చ జరుగుతోంది. నంద్యాల, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించాల్సిన భూమిపై మంత్రివర్గం చర్చిస్తోంది.

Related News

రాష్ట్రాభివృద్ధికి ఈ నిర్ణయాలు కీలకం కానున్నాయి. ఈ నిర్ణయాలు ప్రభుత్వ పనుల పురోగతిని మరియు ప్రజల అవసరాలకు సమగ్ర ప్రతిస్పందనను ప్రతిబింబిస్తాయి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *