జియో యూజర్లకు మరో షాక్.. ఆ రెండు పాపులర్ ప్లాన్‌ల నిలిపివేత

Mobile users  టెలికాం కంపెనీలు ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. Airtel, Reliance Jio, Vodafone Idea కంపెనీలు తమ టారిఫ్‌లను భారీగా పెంచాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ క్రమంలో Reliance Jio mobile tariffs లను 12-27 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన రీఛార్జ్ ప్లాన్ ధరలు జూలై 3 నుంచి అమల్లోకి రానున్నాయి.పెరిగిన రీఛార్జ్ ధరలతో Mobile Phone  వినియోగదారులపై మరింత ఆర్థిక భారం పడనుంది. ఈ నేపథ్యంలో జియో తన యూజర్లకు మరో షాక్ ఇచ్చింది. రెండు పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను నిలిపివేసి రీఛార్జ్ ధరల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వినియోగదారులకు Jio షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ రెండు ప్లాన్స్ ఏంటి?

ప్రస్తుతం మొబైల్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చేతిలో ఫోన్ లేకుంటే నిమిషం కూడా గడవని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఫోన్ రీఛార్జ్ చేసుకోవడం తప్పనిసరి అయిపోయింది. అయితే టెలికాం కంపెనీల ఛార్జీలపై వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో, Jio వినియోగదారులు ఎక్కువగా 84 రోజుల చెల్లుబాటు ధర రూ. 395, 336 రోజుల చెల్లుబాటు ధర రూ. 1,559 ప్లాన్‌లు తొలగించబడ్డాయి. ఈ రెండు ప్లాన్‌లు కనిపించడం లేదని వినియోగదారులు X లో ఫిర్యాదు చేస్తున్నారు. రేపటి నుంచి రీఛార్జి ధరలు పెరగనుండటంతో ముందస్తుగా ప్రస్తుత ధరలతోనే రీఛార్జ్ చేసుకుంటున్నారు.

Related News

ఈ రెండు Prepaid Planలు అపరిమిత 5G డేటాతో చాలా మందిని ఆకర్షించాయి. టారిఫ్‌ను పెంచాలని జియో తీసుకున్న నిర్ణయం కారణంగా, రీఛార్జ్ చేయాలనుకునే వినియోగదారులకు ఇవి అందుబాటులో లేవు. ఈ రెండు ప్లాన్ల నుంచి ఆదాయం తక్కువగా ఉండడంతో ఈ ప్లాన్లను నిలిపివేసినట్లు టెలికాం వర్గాలు భావిస్తున్నాయి. మరియు ప్రధాన టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచడంతో, వినియోగదారులు ప్రత్యామ్నాయ నెట్‌వర్క్‌లను చూస్తున్నారు. BSNLలో తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలతో కూడిన ప్లాన్‌లు అందుబాటులో ఉండటంతో వినియోగదారులు ఈ నెట్‌వర్క్‌కి మారేందుకు ఆసక్తి చూపుతున్నారు.