అధిక ఉష్ణోగ్రతలతో అమెరికా మండుతుంది. మండే ఎండలో Donald Trump’s సమావేశానికి వచ్చిన 11 మంది వడదెబ్బకు గురయ్యారు. ఇప్పటి వరకు వేసవి తాపం ఇబ్బంది పెడుతున్నా నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడింది. ఇదిలా ఉంటే అగ్రరాజ్యం America లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అమెరికాలో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో high temperatures ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
రోజురోజుకు ఎండ తాలుకు మంటలు ఎగిసిపడుతున్నాయి.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొన్నటి వరకు మంచు తుఫానులు, భారీ వర్షాలతో అల్లాడుతున్న అమెరికన్లు ఒక్కసారిగా temperatures పెరగడంతో అల్లాడిపోతున్నారు. కనీసం ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు.
ముఖ్యంగా అమెరికాలోని నైరుతి రాష్ట్రాలు వేడిగాలుల తాకిడికి గురవుతున్నాయి. ఆగ్నేయ కాలిఫోర్నియా నుండి అరిజోనా మరియు నెవాడా వరకు, రెండు లేదా మూడు రోజుల క్రితం పగటి temperatures 43 degrees Celsius కు చేరుకుంది. Nevada లోని Las Vegas నిన్న వేడి గాలులు కొనసాగాయి. అమెరికా నైరుతి ప్రాంతంలో వేసవి కాలం ఇంకా రెండు వారాల దూరంలో ఉంది, కానీ అప్పటికే సూర్యుడు ప్రకాశించడం ప్రారంభించాడు.
Phoenix లో 45 degrees Celsius గా కొత్త రికార్డును నమోదు చేసింది. ఫీనిక్స్లో జరుగుతున్న రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సమావేశానికి వచ్చిన వారిలో 11 మంది వడదెబ్బతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. రెనో, నెవాడాలో సగటు temperature 27 degrees Celsius .
రెండేళ్ల క్రితం 37 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరిజోనా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 43 degrees Celsius temperature కొనసాగుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు global warming కు నిదర్శనమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వాతావరణ మార్పుల కారణంగా global warming 2015 పారిస్ వాతావరణ చర్చల్లో నిర్దేశించిన పరిమితిని మించిపోతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ప్రతి గంటకూ వేడి పెరుగుతోందని తెలిపారు.
ప్రజలు ఉదయం పూట ఇళ్ల నుంచి బయటకు రావద్దని, సరిపడా మంచినీరు తాగమని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 2016లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని.. గతంలోని రికార్డులు బద్దలవుతాయని అధికారులు తెలిపారు.