నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 28న జాబ్ మేళా నిర్వహించనున్నారు. అమెజాన్ కంపెనీకి సంబంధించి ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు పలుచోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. జనగాం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 28న జాబ్ మేళా నిర్వహించనున్నారు.
ఈ మేరకు జిల్లా ఉపాధిహామీ అధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అమెజాన్ కంపెనీకి సంబంధించి ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జనగాం, భూపాలపల్లి ప్రాంతాల్లో అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆపైన చదివిన వారు ఇందుకు అర్హులని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని ఆయన సూచించారు. జిల్లా ఉపాధిహామీ కార్యాలయంలో గతంలో అనేక జాబ్ మేళాలు నిర్వహించినట్లు తెలిపారు.
వీటిలో వేలాది మంది నిరుద్యోగ యువత పాల్గొని ఉద్యోగాలు పొందారని తెలిపారు. ఈ నెల 28న జరిగే జాబ్ మేళాకు ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో ఉదయం 10:30 గంటలకు జనగాం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జరిగే జాబ్ మేళాలో పాల్గొనాలన్నారు. , ఆధార్ కార్డ్ మరియు పాస్‌పోర్ట్ ఫోటోలు.
ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం 79954 30401 నంబర్‌లో సంప్రదించాలని జిల్లాకు చెందిన ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.