Alert: ప్రయాణికులకు అలర్ట్.. ఆ రూట్లో పలు రైళ్లు ఆలస్యం..కారణమిదేనా?

అనకాపల్లిలోని విజయరామరాజు పేట వద్ద రైల్వే వంతెన కింద వెళుతున్న భారీ వాహనం గ్యాంట్రీని ఢీకొట్టింది. ఈ సంఘటన కారణంగా రైల్వే వంతెన పూర్తిగా కూలిపోయింది. అప్రమత్తమైన అధికారులు గోదావరి, విశాఖ, మహబూబ్ నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వివిధ ప్రదేశాలలో నిలిపివేశారు. గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కాశీంకోటలో, మహబూబ్ నగర్ ఎక్స్‌ప్రెస్‌ను ఎలమంచిలిలో నిలిపివేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ సందర్భంలో చాలా రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నందున, అధికారులు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో గోదావరి, విశాఖ, సింహాద్రి, అమరావతి, గరీబ్‌రాద్, మహబూబ్ నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయని వెల్లడించారు.

 

Related News

రైళ్ల గురించి సమాచారం కోసం.. ప్రయాణికులు 0891 2746330, 0891 2744619, 87126 41255, 77807 87054 ఫోన్ నంబర్లకు కాల్ చేయాలి. విజయమరాజుపేట రైల్వే వంతెన మరమ్మతులు సీనియర్ రైల్వే అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. ట్రాక్ పునరుద్ధరించబడిన వెంటనే రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయి.