RBI: అలెర్ట్.. ఈ నెలాఖరు మూడు రోజులూ పని చేయనున్న బ్యాంకులు ఇవే..

కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చే నెల నుండి ప్రారంభం కానుండటంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులకు కీలక సూచనలు జారీ చేసింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజున ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకులకు షెడ్యూల్ చేయబడిన మార్చి 31 సెలవును రద్దు చేసింది. మార్చి 31కి ముందు ఆర్థిక సంవత్సరం ముగింపుకు సంబంధించి నిర్వహించాల్సిన ప్రత్యేక క్లియరింగ్ కార్యకలాపాల్లో అన్ని బ్యాంకులు పాల్గొనాలని స్పష్టం చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రభుత్వానికి ఆ రోజు ఆదాయం, చెల్లింపు ప్రక్రియలు ఉంటాయి. వారి లావాదేవీలను ప్రాసెస్ చేయాల్సిన బ్యాంకులు తప్పనిసరిగా విధుల్లో ఉండాలి. బ్యాంకులతో పాటు, దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను, CGST కార్యాలయాలు కూడా మార్చి 29-31 మధ్య తెరిచి ఉంటాయి. పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన పెండింగ్ లావాదేవీలను పూర్తి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు RBI తెలిపింది.

మరోవైపు.. పాలసీదారులు ఎటువంటి అసౌకర్యాన్ని ఎదుర్కోకుండా చూసుకోవడానికి బీమా కంపెనీలను మార్చి 29, 30, 31 తేదీల్లో తమ కార్యాలయాలను తెరిచి ఉంచాలని భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ (IRDAI) కూడా ఆదేశించింది.

Related News