ప్రముఖ ఆభరణాల సంస్థ Kalyan Jewellers లో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా జనం భయాందోళనకు గురయ్యారు.
అయితే AC blast వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దాంతో ఏసీ వాడేవాళ్లు కాస్త భయపడుతున్నారు. వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు చాలా మంది తమ ఇళ్లలో ACలు వినియోగిస్తున్నారు. ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉండడంతో.. గతంతో పోలిస్తే.. ఈసారి AC లకు కాస్త demand పెరిగింది.
ఈ ఏడాది మార్చి నుంచి ఎండలు మండిపోతున్నాయి. దీంతో భానుడి ప్రతాపం నుంచి తప్పించుకునేందుకు ప్రజలు air conditioners and coolers కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ వేసవిలో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. అయితే AC వినియోగంలో అజాగ్రత్తగా ఉంటేKalyan Jewelers లో జరిగినట్లుగా పేలుడు సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
AC ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వాటిని అమర్చుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. లేకుంటే పెద్దఎత్తున నష్టపోతామని హెచ్చరిస్తున్నారు. కొత్త ఏసీ వినియోగిస్తున్నప్పుడు కంటే సెకండ్ హ్యాండ్, పాత లేదా అద్దెకు తీసుకున్న AC లు వాడినప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెబుతున్నారు.
AC పేలుడు కారణం:
Electrical faults: wiringసరిగా లేకపోవడం, లూజ్ కనెక్షన్, short circuit మొదలైన వాటి వల్ల ఏసీ పేలుడు సంభవించవచ్చు.
Gas Leakage: ఏసీలోని కూలింగ్ సిస్టమ్ లో Gas Leakage అయితే.. ఏదైనా మండే పదార్థం లేదా పరికరం తాకితే పేలుడు సంభవించే అవకాశం ఉంది.
Overheating : ఏసీ బాగా వేడెక్కినా లేదా సరిగా చల్లబడకపోయినా పేలిపోతుంది.
Improper maintenance: ఏసీలు సరైన నిర్వహణ లేకుంటే పేలిపోయే ప్రమాదం ఉంది. అలాగే సమయానికి సర్వీస్ చేయకపోతే అది పేలుడుకు దారి తీస్తుంది.
Turbo Mode: సాధారణంగా ఒక AC దాని టర్బో మోడ్‌ని వేగవంతమైన శీతలీకరణ కోసం ఉపయోగిస్తుంది. కానీ ఎక్కువ కాలం వాడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
పేలుడు నివారణకు చిట్కాలు:
Electrical safety: ఎయిర్ కండీషనర్‌ని ఇన్‌స్టాల్ చేసేటప్పుడు.. ప్రొఫెషనల్ ఎలక్ట్రీషియన్‌ని తీసుకుని పని చేయండి. ఎప్పటికప్పుడు విద్యుత్ భద్రతను కూడా తనిఖీ చేయండి.
Regular maintenance: ఏసీని కూడా ఎప్పటికప్పుడు సర్వీస్ చేయాలి. 600 గంటల ఉపయోగం తర్వాత AC సర్వీసింగ్ అవసరమని గమనించండి.
Leakage Check: మీరు ఎయిర్ కండీషనర్ నుండి గ్యాస్ వాసన వస్తున్నట్లయితే, వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ చేసి, టెక్నీషియన్‌ను పిలవండి.
మితిమీరిన వినియోగాన్ని నివారించండి: సహజంగానే, ACని ఉపయోగించడం తీవ్రమైన వేడిలో నడుస్తుంది. అటువంటి పరిస్థితులలో, దానిని ఎక్కువసేపు ఉంచకూడదు.
టర్బో మోడ్ యొక్క సరైన ఉపయోగం: గది చల్లబడిన తర్వాత, టర్బో మోడ్‌ను ఆఫ్ చేయాలి. ఏసీని సాధారణ వేగంతో నడపాలి. లేదంటే కంప్రెసర్‌పై భారం పెరుగుతుంది.