ప్రిన్సిపాల్ తిట్టడంతో పదో తరగతి విద్యార్థి పాఠశాల భవనంపై నుంచి దూకాడు.

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఈ దారుణ సంఘటన జరిగింది. పదవ తరగతి విద్యార్థి (నీరజ్) పాఠశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఆత్మహత్య దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం నీరజ్.. పాఠశాల భవనంలోని రెండవ అంతస్తు బాల్కనీలో మరో విద్యార్థితో మాట్లాడుతుండగా, ప్రిన్సిపాల్ ఇద్దరినీ తన గదిలోకి పిలిచి మందలించాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రిన్సిపాల్ మందలించడంతో మనస్తాపం చెందిన నీరజ్, తాను టాయిలెట్‌కు వెళ్తున్నానని చెప్పి భవనం పై నుంచి దూకాడని చెబుతున్నారు. నీరజ్ భవనం పై నుంచి పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మెరుగైన చికిత్స కోసం నీరజ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే అతను మరణించాడు. మరణించిన విద్యార్థి నీరజ్‌ను బీజేపీ షాద్‌నగర్ పట్టణ అధ్యక్షుడు హరి భూషణ్ కుమారుడిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వారు తెలిపారు.