విమానం లాంటి బస్సు.. 132 సీట్లతో రోడ్లపైకి..!

దేశంలో కొత్త బస్సులు వస్తున్నాయి.. ఆ బస్సుల్లో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా.. 132 సీట్లు అక్షరాలు.. విమానంలా.. లేకుంటే బస్సు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

విమానంలో ఉన్నట్లే ఈ బస్సులో బస్ హోస్టెస్ ఉంటుంది.. భోజనం వడ్డిస్తారు.. టీ ఇస్తారు.. స్నాక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. దేశంలోనే పైలట్ ప్రాజెక్టు కింద.. టాటా కంపెనీ సహకారంతో.. కేంద్ర రవాణా శాఖ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఏడాది లేదా ఏడాదిన్నరలోగా 132 సీట్లతో బస్సులు రోడ్లపైకి రానున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

భారత్ లో కాలుష్యాన్ని తగ్గించేందుకు రవాణా వ్యవస్థలో పలు మార్పులు చేస్తున్నామని వివరించారు. లీటర్ పెట్రోల్‌కు 120 రూపాయలు చెల్లించే బదులు.. 60 శాతం పెట్రోల్. 40 శాతం ఇథనాల్ వాడటం వల్ల డబ్బు ఆదా అవుతుందని, కాలుష్యం తగ్గుతుందని వివరించారు.

బస్సు రవాణాలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం 40 సీట్ల డీజిల్ బస్సును నడపాలంటే కిలోమీటరుకు 115 రూపాయలు ఖర్చవుతుందని, అదే ఎలక్ట్రిక్ ఏసీ బస్సుకు కేవలం 41 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందన్నారు. అదే 132 సీట్ల బస్సును తీసుకురావడం వల్ల ప్రయాణికుల టికెట్ ధర 20 శాతం ఆదా అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

132 సీట్లున్న ఈ బస్సు విమానంలా ఉంటుందని వివరించారు. ఇందులో బస్ హోస్ట్‌లు మరియు ఆహారం ఉంటాయి. ప్రస్తుతం మూడు బస్సులు తిరుగుతున్న చోట ఒక బస్సులో మూడు బస్సుల ప్రయాణికులు ఆనందంగా ప్రయాణించవచ్చని తెలిపారు. త్వరలో Tata company తో కలిసి Nagpur లో pilot project గా ప్రారంభించనున్నట్లు Nitin Gadkari వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *