Tata Tiago: ఒక్క లుక్కుతో ప్రేమలో పడేస్తున్న కారు… తక్కువ ఖర్చుతో మెర్సిడెస్ ఫీల్ పక్కా…

స్మాల్ కార్ల సెగ్మెంట్‌లో తక్కువ ధరకే ఎక్కువ విలువ చూపించేందుకు చాలా కార్లు పోటీ పడుతున్నాయి. కానీ టాటా తియాగో మాత్రం నిశ్శబ్దంగా తన స్థానం సంపాదించుకుంది. ఇది బయటకు అంతగా మెరుపులేని కార్‌ అనిపించినా.. ఒక్కసారి డ్రైవ్ చేస్తే అసలు మ్యాటర్ అర్థమవుతుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

తక్కువ బడ్జెట్‌లో స్టైల్, బలమైన బాడీ, క్లాస్ లుక్ అన్నీ కలబోసిన కార్ ఇది. మొదటి సారి కారు కొంటున్నవారికైనా, రోజూ సిటీ డ్రైవింగ్ కోసం ఉపయోగించాలనుకున్నవారికైనా ఇది చాలా సరైన ఎంపిక. ఈ తియాగో కార్‌లో మంచి మైలేజ్, స్టైల్, సేఫ్టీ అన్నీ ఒకే చోట కనిపిస్తాయి.

వాహనాన్ని బయట నుంచి చూస్తేనే ఆకర్షణగా అనిపిస్తుంది. పెద్దగా ఒత్తిడిలేకుండా, సింపుల్‌గా స్పోర్టీ లుక్ ఇస్తుంది. ముందు భాగంలో క్రోమ్ డిజైన్, స్మార్ట్ హెడ్‌లైట్స్, బలమైన బంపర్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ చక్కగా ఉంటుంది. వెనుక భాగంలో ఎల్ఈడి టెయిల్ లైట్స్ ఉండటం వల్ల కార్ లుక్ మరింత మెరుగవుతుంది. ఫ్లేమ్ రెడ్, అరిజోనా బ్లూ, ఓపల్ వైట్ లాంటి యూనిక్ కలర్స్‌లో తియాగో అందుబాటులో ఉంది. ఇవి కారు లుక్‌ను మరింత స్టైలిష్‌గా చూపిస్తాయి.

Related Posts

ఇంటీరియర్‌లోకి వెళితే మాత్రం ఆశ్చర్యపోతారు. రెండు కలర్‌ టోన్ల డాష్‌బోర్డ్, క్రోమ్ డిజైన్ వెంట్స్, కంఫర్టబుల్ సీట్స్ ఈ కార్‌కు ప్రీమియం ఫీల్ ఇస్తాయి. 7-ఇంచ్ టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఉన్నాయ్. హర్మన్ ఆడియో సిస్టమ్ విత్ 8 స్పీకర్లు ఈ సెగ్మెంట్‌లో బెస్ట్ అనిపిస్తుంది. బూట్ స్పేస్ కూడా వీకెండ్ టూర్‌కు సరిపోతుంది.

పెర్ఫామెన్స్ విషయానికి వస్తే, 1.2 లీటర్ 3 సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ 86PS పవర్, 113Nm టార్క్ ఇస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్, లేదా AMT గేర్ బాక్స్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. సిటీలో డ్రైవ్ చేయడానికి ఇది చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. క్లచ్ సాఫ్ట్‌గా ఉంటుంది. గEAR షిఫ్ట్ స్మూత్‌గా ఉంటుంది. హైవేపైనా ఇది స్టబిల్‌గా వంద కిలోమీటర్ల వేగాన్ని దాటుతుంది.

సస్పెన్షన్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. రోడ్డు మీద బంప్స్ ఉన్నా, లోపలున్నవారికి పెద్దగా డిస్టర్బ్ కాదు. వాహనాన్ని కార్నర్‌ల్లో కూడా సురక్షితంగా తిప్పవచ్చు. శబ్ద నిరోధకత కూడా బాగుంది. లో స్పీడ్లో ఇంజిన్ శబ్దం అసలు వినిపించదు.

సేఫ్టీ విషయంలో టాటా తియాగో మంచి స్టాండర్డ్‌ని ఉంచింది. రెండు ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ అన్ని స్టాండర్డ్‌గా ఉన్నాయి. గ్లోబల్ NCAP నుంచి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కింది.

కొన్ని చిన్న నెగటివ్ పాయింట్లు కూడా ఉన్నాయి. ఎక్కువ వేగంలో ఇంజిన్ శబ్దం ఎక్కువగా ఉంటుంది. AMT గేర్ బాక్స్ కొన్నిసార్లు తడబడుతుంది. బూట్ స్పేస్ ఇంకా కొంచెం ఎక్కువగా ఉండినట్లైతే ఇంకా బావుండేదనిపిస్తుంది.

కానీ మొత్తానికి ఈ కార్ ధరను బట్టి చూస్తే ఇది టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తుంది. డిజైన్, ఫీచర్లు, బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ అన్నీ కలిపితే టియాగో అనేది నిజంగా స్మార్ట్ ఇండియన్ కార్. ధర తక్కువ.. కానీ ఫీల్ మాత్రం హై ఎండ్ కార్‌లా ఉంటుంది.

ఒక్కసారి షోరూంకి వెళ్లి టియాగో చూసి టెస్ట్ డ్రైవ్ చేస్తే, మీరు కూడా “ఇంత తక్కువ ధరకే ఇంత బాగుందా?” అని అడుగుతారు!