Luck Plants: మీ ఇంట్లో ఈ 4 మొక్కలుంటే లక్ష్మీదేవి వాసమే.. సంపద, శుభం, ఆరోగ్యం అన్నీ ఒక్కచోటే…

మన పూర్వీకులు చెప్తే వినాలి అంటారు కదా! పల్లెటూర్లలో ఇప్పటికీ ప్రతి ఇంటి ముందు తులసి కోట కనిపిస్తుంది. ఎందుకంటే తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. శుభం కోరుకునే ప్రతి హిందూ కుటుంబంలో తులసి తప్పనిసరిగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం తులసిని ఉత్తర దిశ లేదా ఈశాన్య మూలలో పెంచితే మన ఇంట్లో శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

తులసి మొక్క కేవలం ఆధ్యాత్మికంగా కాదు, ఆరోగ్యపరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలిగిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. తులసి ఆకులను ఉదయం తింటే జలుబు, దగ్గు వంటి రోగాలు దూరం అవుతాయని పెద్దలు చెబుతారు. అంతేకాదు, ఇది మన ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేస్తుందన్న నమ్మకమూ ఉంది.

ఇంకో పవిత్రమైన మొక్క అంటే వెదురు. చాలా మంది ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటున్నారు. ఫెంగ్‌షుయ్ ప్రకారం వెదురు మొక్క మన జీవితంలో ప్రశాంతతను, అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్మకం. ఇది పేరుప్రతిష్టలు, డబ్బు కూడా ఆకర్షిస్తుందని చెబుతారు. వెదురు మొక్కను బహుమతిగా ఇవ్వడం మంచి శుభం తీసుకురావడం వంటిదని తూర్పు దేశాల్లో చాలా మంది నమ్ముతారు.

మనీ ప్లాంట్ గురించి తెలియని వాళ్లు ఉండరు. ఇది మన ఇంట్లో విజయాన్ని, ఆర్థిక స్థిరతను తీసుకురావడానికి ఉపయోగపడతుందని విశ్వాసం. దీనిని ఇంటిలో ఆగ్నేయ దిశలో పెంచితే ఆర్థిక సమస్యలు తగ్గుతాయని అంటారు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి – మనీ ప్లాంట్‌ను ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకంటే మన వద్ద ఉన్న సంపదను కూడా వాళ్లకు అప్పజెప్పినట్లవుతుందని నమ్మకం ఉంది.

ఇంకా ఒక అదృష్ట మొక్క – జేడ్ ప్లాంట్. దీన్ని జడ్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది మన ఇంట్లో ఉంటే సక్సెస్, దైర్యం, అభివృద్ధి అన్నీ కలుగుతాయని విశ్వాసం ఉంది. జేడ్ మొక్క మన జీవితంలో ఉన్న బంధాలను బలంగా ఉంచుతుందని కూడా నమ్ముతారు. ఇది మన ఆర్థిక సమస్యల్ని దూరం చేస్తుందని పలువురు చెబుతున్నారు.

ఇవన్నీ కాకుండా, మన మాతృదేవతలతో సంబంధమున్న మరో మొక్క ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా పూజిస్తారు. విష్ణువుకీ ఇది అత్యంత ఇష్టమైన మొక్కగా పురాణాలు చెబుతున్నాయి. ఈ చెట్టును తూర్పు లేదా ఉత్తర దిశలో పెంచితే ఇంట్లో శాంతి, సంపద నిలుస్తాయని నమ్మకం ఉంది.

ఈ నాలుగు మొక్కలు మీ ఇంట్లో పెంచుకుంటే, ఆరోగ్యం, ఆర్థిక లాభం, శుభశాంతులు అన్నీ కలుసుకుంటాయి. ఇవి కేవలం మొక్కలు కాదు… మన జీవితంలో శుభం తీసుకొచ్చే దైవిక ఆశీస్సులు. మీరు కూడా ఈ మొక్కలను వెంటనే ఇంట్లో పెట్టండి.. ఆలస్యం చేస్తే మిస్సవుతారు అనుకున్న అదృష్టాన్ని!