గోంగూర పచ్చడి అంటేనే చాలా మందికి నోరూరుతుంది. వేడి అన్నంలో ఒక చెంచా గోంగూర పచ్చడి వేసుకుంటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. కానీ చాలామందికి ఈ పచ్చడి నిల్వగా ఎలా తయారు చేయాలో తెలియదు. ఒకసారి ఈ పద్ధతిలో ఇంట్లోనే చేస్తే, మీరు బయట పచ్చడి కొనాలని ఎప్పుడూ అనుకోరు. ఈ విధంగా తయారు చేస్తే, ఏడాది పాటు ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచుకోవచ్చు. రుచి, అరోగ్యం రెండూ కలిసే ఈ గోంగూర నిల్వ పచ్చడి ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా తాజా గోంగూర ఆకులు తీసుకొని శుభ్రంగా నీటితో మూడు సార్లు కడగాలి. ఆ తరువాత పొడి వస్త్రం మీద వేసి ఎండబెట్టాలి. ఈ దశలో ఆకుల్లో తడిలేకుండా చూసుకోవాలి. అవి బాగా ఆరిన తర్వాత పక్కన పెట్టాలి. అలాగే చింతపండు కొద్దిగా వేడి నీటిలో నానబెట్టాలి. ఇది కూడా రుచి కోసం చాలా ముఖ్యం.
తాలింపు కోసం ఒక పాన్ పెట్టి నూనె వేడిచేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి ముక్కలు, ఎండు మిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి బాగా వేయించాలి. ఇవి రంగు మారే వరకు వేయించాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చాలి.
Related News
ఇప్పుడు మరో పాన్‌లో కొద్దిగా మెంతులు, ఆవాలు వేసి దోరగా వేయించాలి. వీటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఇది గోంగూరకి ప్రత్యేకమైన రుచి ఇస్తుంది.
తర్వాత కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. అందులో గోంగూర ఆకులు వేసి బాగా మగ్గించాలి. ఆకులు మగ్గిన తర్వాత చల్లారనివ్వాలి. ఇక నానబెట్టిన చింతపండు గుజ్జును తీసి చిక్కటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.
ఇప్పుడు అదే గోంగూర మగ్గించిన కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి అందులో చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు వేసి కలిపి మరిగించాలి. ఇది బాగా చిక్కగా అయ్యేంతవరకూ మరిగించాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చాలి.
చివరగా ఒక పెద్ద గిన్నెలో మగ్గించిన గోంగూర, మరిగించిన చింతపండు గుజ్జు, పొడి చేసిన మెంతులు, ఆవాల పొడి, కారం అన్నింటినీ బాగా కలిపి తాలింపు కూడా వేసి మెత్తగా కలపాలి. అంతే! చిప్‌లు, అన్నం, చపాతీలతో ఈ పచ్చడి అద్భుతంగా నోట్లో లయమవుతుంది.
ఇది మీ ఇంట్లో తయారుచేసుకుని ఫ్రిడ్జ్‌లో నిల్వ పెట్టుకుంటే ఏ మాత్రం రుచి తగ్గదు. నెలల తరబడి మీరు దీని రుచి ఆస్వాదించవచ్చు. ఒకసారి ఈ పద్దతిలో చేసి చూసేయండి… మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ మళ్లీ మళ్లీ కోరుకుంటారు.