పెన్షన్ కోసం ఎదురుచూసే ప్రభుత్వ ఉద్యోగులకు ఇది చారిత్రాత్మక అవకాశమనే చెప్పాలి. ఏప్రిల్ 1, 2025 నుంచి నేషనల్ పెన్షన్ సిస్టం (NPS) కింద Unified Pension Scheme (UPS) అనే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద ఉద్యోగులు వారి ఉద్యోగ జీవితాంతం సేవలకు గానూ నెల నెలా ఖచ్చితమైన పెన్షన్‌ను పొందే అవకాశం ఉంది. ఇది పాత పెన్షన్ పథకం మాదిరిగా, ఉద్యోగుల భవిష్యత్తును భద్రతగా మార్చే దిశగా తీసుకున్న పెద్ద అడుగుగా చెప్తున్నారు నిపుణులు.
ఈ పథకంలో చేరదలచిన ఉద్యోగులు 2025 జూన్ 30 లోపే ఎంపిక చేసుకోవాలి. ఈ అవకాశం చక్కగా వాడుకుంటే మీరు సేవలో ఉండగానే భవిష్యత్తు కోసం సంపూర్ణ భద్రతను ఏర్పరుచుకున్నవారవుతారు. ఇది NPS ఆధారంగా రూపొందించిన కొత్త పెన్షన్ పథకం. దీని ముఖ్య ఉద్దేశం ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత నెల నెలా ఖచ్చితమైన, ముందే నిర్ణయించిన పెన్షన్ ఇవ్వడం. గతంలో అందుబాటులో ఉండే Defined Benefit Pension Scheme లాగా ఇది కూడా స్థిర ఆదాయాన్ని హామీ ఇస్తుంది.
25 ఏళ్ల సేవ చేస్తే 50% పెన్షన్
ఈ పథకంలో ఒక వ్యక్తి కనీసం 25 సంవత్సరాలపాటు ఉద్యోగ సేవలందిస్తే, పదవీ విరమణకు ముందు 12 నెలల సగటు ప్రాథమిక జీతం యొక్క 50% పెన్షన్‌గా ప్రతి నెల వస్తుంది. ఉదాహరణకు, మీ ప్రాథమిక జీతం ₹60,000 ఉంటే, మీకు నెలకు ₹30,000 పెన్షన్ వస్తుంది.
Related News
10 సంవత్సరాల సేవకే కనీస పెన్షన్ హామీ
ఎవరైనా ఉద్యోగి కనీసం 10 సంవత్సరాలు సేవలో ఉంటే, అయినా సరే వారికి నెలకు కనీసం ₹10,000 పెన్షన్ హామీ ఉంటుంది. ఇది వారి సేవా కాలం ఆధారంగా గణించి ఇచ్చే పెన్షన్. అంటే 10 నుండి 25 సంవత్సరాల మధ్య సేవకూ నిష్పత్తిగా పెన్షన్ లభిస్తుంది.
UPS Calculator తో ముందే లెక్కించొచ్చు
మీ భవిష్యత్తు పెన్షన్ ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి ప్రభుత్వం UPS Calculator విడుదల చేసింది. మీరు https://npstrust.org.in/ups-calculator అనే వెబ్‌సైట్‌కి వెళ్లి మీ పుట్టిన తేదీ, ఉద్యోగంలో చేరిన తేదీ, పదవీ విరమణ వయస్సు, ప్రస్తుత జీతం, ప్రతి సంవత్సరం జీతం పెరుగుదల లాంటి వివరాలు నమోదు చేస్తే, మీకు ఎన్ని రూపాయలు పెన్షన్ వస్తుందో అంచనా వస్తుంది. ఈ టూల్ ద్వారా మీరు ముందే మీ పెన్షన్ మొత్తాన్ని తెలుసుకోగలుగుతారు. అది మీ ఆర్థిక ప్రణాళికను బలోపేతం చేస్తుంది.
ఈ పథకం వల్ల లాభాలు ఏమిటి?
ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఉద్యోగులు ఖచ్చితమైన, గ్యారంటీ పెన్షన్ పొందగలుగుతారు. ఉద్యోగి మరణించినా, వారి కుటుంబానికి 60% పెన్షన్ లభిస్తుంది. పదవీ విరమణ అనంతరం జీవన ఖర్చులకు ఇది పెద్ద ఊరట. అదనంగా, పెన్షన్ కూడా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరగుతుంది.
గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు
ఈ స్కీమ్‌ను ఎంపిక చేసిన తర్వాత ఇక మార్పు చేసుకోలేరు. అందుకే ఈ నిర్ణయం తీసుకునే ముందు మీరు పూర్తిగా ఆలోచించి, సలహాలు తీసుకుని ముందుకెళ్లాలి. UPS ఎంపిక చేసిన ఉద్యోగులు మిగతా స్కీములు, పాలసీల ప్రయోజనాలను పొందలేరు. కేంద్రం ఈ స్కీమ్‌లో తమ వాటాను 18.5%కి పెంచగా, ఉద్యోగుల వంతు 10%గానే కొనసాగుతుంది.
2025 మార్చి 31 వరకు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు కూడా ఈ స్కీమ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. కానీ ఉద్యోగులు కనీసం 25 సంవత్సరాల సేవ చేయాలి. లేకపోతే 10 ఏళ్లకైనా పైగా ఉంటే, నిష్పత్తిగా పెన్షన్ లభిస్తుంది. కానీ ఎంత కాలం పనిచేసినా నెలకు కనీసం ₹10,000 పెన్షన్ మాత్రం హామీగా అందుతుంది.
ఇప్పుడు చేసేదేంటి?
ఈ అవకాశాన్ని మిస్ అయితే జీవితాంతం పశ్చాత్తాపమే మిగులుతుంది. June 30, 2025 లోపే మీరు Unified Pension Scheme కోసం ఎంపిక చేసుకోవాలి. ఇది మీ రిటైరమెంట్ జీవితం ప్రశాంతంగా ఉండేందుకు ప్రభుత్వమే చూపుతున్న మార్గం. ప్రస్తుత NPS లో ఉన్న ఉద్యోగులకు ఇది ఒక బంగారు అవకాశమే.
ఈ స్కీమ్ మీకు లాభమా కాదా అన్నదానిపై సందేహాలుంటే, మీ ఆఫీస్ అకౌంటింగ్ శాఖను సంప్రదించండి. లేదా UPS కాలిక్యులేటర్ వాడి ముందే అంచనా వేసుకోండి. ఒక్కసారి ఎంపిక చేస్తే మారలేని ఈ స్కీమ్‌ను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. కానీ ఎంపిక అయితే మాత్రం భవిష్యత్తు భద్రమైనదే. ఇప్పుడు కుదిరిన అవకాశాన్ని వదులుకోకుండా మీరు కూడా మీ పెన్షన్ భద్రతకు మొదటి అడుగు వేయండి.