ఈ నెలలో ఆదాయపు పన్ను శాఖ కొత్త ITR ఫారమ్స్ విడుదల చేసింది. యూనియన్ బడ్జెట్ 2024లో క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ నిబంధనల్లో మార్పులు చేయడంతో ఈ కొత్త ఫారమ్స్ అవసరమయ్యాయి. అలాగే ఇంకొన్ని ముఖ్యమైన మార్పులు కూడా ఇందులో చేశారు.
ఇంకా ITR ఫైలింగ్ యుటిలిటీస్ విడుదల కాలేదు. అలాగే కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఫారమ్ 16 ఇవ్వలేదు. అయినా కూడా ట్యాక్స్ పేయర్లు ఇప్పటి నుంచే అవసరమైన డాక్యుమెంట్స్ సేకరించడం ప్రారంభించాలి. ఎందుకంటే చివరి నిమిషంలో హడావుడిగా ఫైలింగ్ చేయడం వల్ల పొరపాట్లు జరగొచ్చు. అలాగే టెక్నికల్ ఇబ్బందులు కూడా ఎదురవుతాయి.
సాధారణంగా ప్రతి సంవత్సరం జూలై 31 తేదీ ITR ఫైలింగ్ చివరి తేదీగా ఉంటుంది. ట్యాక్స్ నిపుణులు చెబుతున్న మాట ఏంటంటే – చివరి తేదీ వరకు ఎదురు చూడకుండా ముందుగానే తయారవ్వడం మంచిది. ఆలస్యం చేస్తే ఫైన్ పడే అవకాశమూ ఉంది. ఫైలింగ్ త్వరగా పూర్తి చేస్తే పొరపాట్లకు అవకాశం ఉండదు. టెన్షన్ లేకుండా ప్రక్రియ సాగుతుంది.
Related News
ముందు మీరు ఏ ట్యాక్స్ రెజీమ్ లోకి వెళ్లాలనుకుంటున్నారు అన్నది నిర్ణయించుకోవాలి. పాత పద్దతిలో ట్యాక్స్ exemptions లభిస్తాయి. కొత్త రెజీమ్ లో exemptions ఉండవు కానీ ట్యాక్స్ slabs తక్కువగా ఉంటాయి. మీ ఆదాయం, మినహాయింపుల ప్రకారం ఏది బెటర్ అనేది చూసుకుని నిర్ణయం తీసుకోండి.
తర్వాత మీరు ఏ ITR ఫారమ్ వాడాలో నిర్ణయించాలి. ఉద్యోగులకు ITR-1 సరిపోతుంది. మీరు అద్దె ఆదాయం, పెట్టుబడి ఆదాయం పొందితే ITR-2 అవసరం. వ్యాపారస్తులకు ITR-3 లేదా 4 అవసరమవుతుంది. ఇది క్లియర్ గా అర్థం కాకపోతే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ సలహా తీసుకోవచ్చు.
సరైన రెజీమ్ మరియు ITR ఫారమ్ ఎంచుకున్నాక అవసరమైన డాక్యుమెంట్లను సేకరించాలి. వీటితో ఫైలింగ్ సరిగ్గా, సరైన పద్ధతిలో జరుగుతుంది. ముఖ్యమైనవి: బ్యాంక్ స్టేట్మెంట్లు, ఫారం 26AS, ఫారం 16, Aadhaar, PAN, గత సంవత్సరం ఫైలుచేసిన ITR కాపీలు, జీతస్లిప్పులు, అద్దె ఒప్పందం కాపీ, ఆరోగ్య బీమా రసీదులు, ఇతర పెట్టుబడి ఆధారాలు మొదలైనవి.
పన్ను రిటర్న్ ఫైల్ చేయడానికన్నా ముందుగా మీరు Form 26AS మరియు AIS (Annual Information Statement) డౌన్లోడ్ చేయాలి. ఈ రెండు డాక్యుమెంట్లు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.
Form 26AS లో మీ ఆదాయం, TDS, TCS వివరాలు ఉంటాయి. ఇది మీరు మీ ఆదాయం మరియు ట్యాక్స్ deduct అయినదాని సరిపోల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. AIS లో మీరు చేసిన అన్ని ఆర్థిక లావాదేవీల వివరాలు ఉంటాయి. బ్యాంక్ లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, స్టాక్ ట్రేడింగ్ వివరాలు, డివిడెండ్ ఆదాయం అన్నీ ఇందులో ఉంటాయి.
2024 బడ్జెట్ ప్రకారం సంవత్సరానికి ₹12 లక్షల వరకూ ఆదాయానికి ట్యాక్స్ మినహాయింపు కల్పించారు. కానీ ఇది కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వస్తుంది. అంటే, దీని ప్రయోజనం వచ్చే సంవత్సరం రిటర్న్ ఫైలింగ్ సమయంలో అందుతుంది. ఇప్పటి ఫైలింగ్ (31 జూలై 2025 లోపు) 2024-25 ఆర్థిక సంవత్సరానికి జరుగుతుంది. అంటే, ఇప్పటికీ పాత రెజీమ్ లో ఫైలింగ్ చేస్తే మినహాయింపు ఆధారాలు సమర్పించాలి. ఉదాహరణకు, 80C లో PPF, LIC, ELSS, హోం లోన్ ప్రిన్సిపల్ చెల్లింపులు, అలాగే 80D లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం వివరాలు ఇవ్వాలి.
ముఖ్యంగా ఉద్యోగులు, సాలరీడ్ పర్సన్లు – జూన్ నెలలో ఫారం 16 వస్తే అప్పటికే లేటవుతుంది. అందుకే ఇప్పుడు నుంచే డాక్యుమెంట్లు సేకరించండి. ఖర్చుల రసీదులు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, వడ్డీ ఆదాయం, ఇతర పెట్టుబడి వివరాలు ఒక్కొక్కటి సరిచూసుకోండి. ఏదైనా పొరపాటు ఉంటే ముందే సరి చేయవచ్చు.
31 జూలై చివరి తేదీ అని మీరు ఎదురు చూస్తే ఆ రోజు సెర్వర్ డౌన్ అవుతుందో, తప్పులు జరుగుతాయో తెలియదు. అదుపులో ఉండే పని ఇప్పుడు చేసుకోండి. అదీగాకుండా ముందే ఫైలింగ్ చేస్తే ట్యాక్స్ రీఫండ్ త్వరగా వస్తుంది. అలాంటప్పుడు మీరు బ్యాంక్ లోకి డబ్బు రావడం కూడా త్వరగా చూస్తారు.
ఇందులో ఒక్క అడుగు కూడా మిస్సవకండి. ఇప్పటి నుంచే సిద్ధం అవ్వండి. పన్ను భారం తగ్గించుకోవాలంటే శ్రమించాల్సిందే. ఈసారి కొత్త నిబంధనలతో మీ రిటర్న్ ఖచ్చితంగా ఉండాలంటే ఇప్పుడే మొదలు పెట్టండి…