Fan Viral Video: కరెంటు లేకుండానే ఈ ఫ్యాన్ రయ్యి మంటూ తిరిగేస్తుంది. ఏమి ఐడియా గురు..!

అసలే ఎండా కలం.. కరెంటు కోతలు.. ఉక్కపోత .. పేదోడి ఇంట్లో కరెంటుఉండదు.. ఇంకా ఫ్యాన్ ఎం తిరుగుతుంది.. ఇలాంటి సందర్భం లో అసలు కరెంటు అవసరం లేకుండా ఫ్యాన్ రయ్యి రయ్యిమని తిరుగుతుంటే.. ఎలా ఉంటుంది.. సూపర్ కదా..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇలాంటి ఆలోచన ఒక సూపర్ ఫ్యాన్ కనుగొనటానికి కారణం అయ్యింది.. ప్రస్తుతం, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను చిన్న చెక్క ముక్కలు, బేరింగ్లు, ఇనుప రాడ్, రబ్బరులు మరియు బోల్ట్లతో ఫ్యాన్ తయారు చేశాడు. మొదట, అతను కలపలో ఒక రంధ్రం చేశాడు. ఆ రంధ్రంలో ఒక బేరింగ్‌ను ఏర్పాటు చేశాడు. ఆ బేరింగ్ ద్వారా ఇనుప రాడ్‌ను ఉంచి దానికి ఫ్యాన్ బ్లేడ్‌లను అమర్చాడు. మరోవైపు, అతను మరొక చెక్క ముక్కను అడ్డంగా ఉంచి దానిలో రబ్బరులను త్రిభుజాకారంలో కట్టాడు.

రబ్బరులను రాడ్‌ను తాకేలా అమర్చారు. మీరు మీ చేతితో ఒకసారి ఫ్యాన్‌ను తిప్పినప్పుడు, రబ్బరులు ఫ్యాన్‌ను తిప్పుతాయి. ఇది విద్యుత్ లేకుండా తిరుగుతూ గాలిని వీస్తుంది. ఈ వీడియోను చూస్తుంటే, “ఇది ఎలా సాధ్యం!” అని మీరు అనుకుంటారు! విద్యుత్ లేకుండా పనిచేస్తున్న ఫ్యాన్‌ను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం మరియు ప్రశంసలతో వ్యాఖ్యల వర్షం కురిపిస్తున్నారు. చాలామంది, “ఇది గొప్ప ఆలోచన” మరియు “మనం అతని ప్రతిభకు సెల్యూట్ చేయాలి” అని అంటున్నారు.

Related News