ప్రస్తుత సమయంలో చాలా మంది తొలిసారి అప్పు తీసుకోవాలని అనుకుంటున్నారు కానీ సరైన ప్లాట్‌ఫామ్ ఎంచుకోవడంలో సందిగ్ధతలో పడిపోతుంటారు. బ్యాంకులకు వెళ్లడం, పేపర్‌వర్క్ చేయడం, ఇంటరెస్ట్, టెన్నూర్ వంటి వివరాలు తెలుసుకోవడానికి చాలా టైమ్ తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ సమస్యకు ఓ సూపర్ సులువైన సొల్యూషన్ వచ్చింది. అదే బజాజ్ మార్కెట్స్.
ఇంటర్నెట్ ఉన్నచోట నుంచే… లోన్ కోసం ఒకే క్లిక్‌తో అప్లై చేయొచ్చు. అంతే కాదు, ఏ బ్యాంక్ ఎంత లోన్ ఇస్తుంది, ఎంత ఇంటరెస్ట్ వసూలు చేస్తుంది, ఎన్ని నెలల్లో తిరిగి చెల్లించాలి అనే సమాచారం మొత్తం ముందే తెలుసుకోవచ్చు. ఇది ముఖ్యంగా తొలిసారి అప్పు తీసుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. ఏమాత్రం కన్‌ఫ్యూజన్ లేకుండా, పూర్తి క్లారిటీతో నిర్ణయం తీసుకునే అవకాశం ఇస్తుంది.
బజాజ్ మార్కెట్స్ అంటే ఏమిటి?
బజాజ్ మార్కెట్స్ అనేది బజాజ్ ఫిన్సర్వ్‌కు చెందిన ఓ డిజిటల్ ఫైనాన్షియల్ మార్కెట్ ప్లేస్. ఇందులో మనం పర్సనల్ లోన్ కాకుండా ఇతర ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ కూడా పొందొచ్చు. క్రెడిట్ కార్డులు, ఇన్సూరెన్స్ పాలసీలు, పెట్టుబడి ఆప్షన్లు, స్టాక్ మార్కెట్ సర్వీసులు, వాల్యూ యాడెడ్ సర్వీసులు ఇలా అన్నింటినీ ఒకే చోట అందుబాటులో ఉంచింది.
కేవలం అప్లికేషన్ ఫిల్ చేయగానే… పర్సనల్ లోన్ డీటైల్స్ పూర్తి స్పష్టతతో చూపిస్తుంది. ఇది పూర్తిగా ఆన్‌లైన్‌లో జరిగే ప్రక్రియ. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చునే అన్ని వివరాలూ తెలుసుకొని అప్లై చేయొచ్చు.
ఎంత వరకు లోన్ వస్తుంది?
బజాజ్ మార్కెట్స్ ద్వారా మీరు పొందగలిగే పర్సనల్ లోన్ మొత్తం ₹500 నుండి ₹55 లక్షల వరకు ఉంటుంది. ఇది మీ అవసరాన్ని బట్టి మీరు ఎంచుకోవచ్చు. మీకు చిన్న అవసరం ఉంటే కూడా ₹500 నుండి ప్రారంభించవచ్చు. లేదా పెళ్లి, మెడికల్ ఎమర్జెన్సీ, విదేశీ ప్రయాణం వంటి భారీ అవసరాలకు లక్షల రూపాయల వరకు లోన్ పొందవచ్చు.
ఇంటరెస్ట్ రేట్లు ఎంత ఉంటాయి?
ఇంటరెస్ట్ రేట్లు సంవత్సరానికి 9.99 శాతం నుండి ప్రారంభమవుతాయి. ఇది మార్కెట్‌లో చాలా పోటీగా ఉన్న రేటే. మీరు ఏ లెండర్‌ను ఎంచుకుంటారో దానిపై ఆధారపడి ఇంటరెస్ట్ రేట్ మారవచ్చు. కానీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఇంటరెస్ట్ రేట్లు ముందే స్పష్టంగా చూపించబడతాయి. కాబట్టి, ఎలాంటి దాగుడు మూతలు ఉండవు. మీకు నచ్చిన పథకాన్ని ఎంచుకొని మిగతా లావాదేవీలు చేసుకోవచ్చు.
ఎంత కాలం పాటు చెల్లించొచ్చు?
ఈ లోన్‌ను తిరిగి చెల్లించేందుకు మీకు గరిష్ఠంగా 96 నెలలు అంటే ఎనిమిదేళ్ల సమయం ఇవ్వబడుతుంది. చిన్న మొత్తానికి తక్కువ టెన్నూర్ ఎంపిక చేసుకోవచ్చు, లేదా ఎక్కువ మొత్తానికి ఎక్కువ కాలానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ మీదే ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇది మొదటి సారి లోన్ తీసుకునే వారికి చాలా పెద్ద సౌలభ్యం.
20కి పైగా బ్యాంకుల నుంచి ఒకే చోట ఆఫర్లు
బజాజ్ మార్కెట్స్‌లో 20కి పైగా ట్రస్ట్ ఉన్న లెండింగ్ పార్టనర్లు అందుబాటులో ఉన్నారు. ప్రతి ఒక్కరిదీ వేర్వేరు ఆఫర్లు, వేర్వేరు షరతులు ఉంటాయి. అయితే వీటన్నిటినీ ఒకే చోట కంపేర్ చేసుకునే అవకాశం ఇస్తుంది ఈ ప్లాట్‌ఫామ్. మీరు ఏ బ్యాంక్ ఎంత ఇచ్చేది, ఏ బ్యాంక్‌లో ఛార్జెస్ తక్కువగా ఉంటాయో ముందుగానే తెలుసుకొని నిర్ణయం తీసుకోవచ్చు.
ఏ హిడెన్ ఛార్జెస్ ఉండవు
ఈ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, పూర్తి పారదర్శకత. అంటే మీరు ఎంత అప్పు తీసుకుంటున్నారు, ఎన్ని ఇన్‌స్టాల్‌మెంట్లలో తిరిగి చెల్లించాలి, ప్రాసెసింగ్ ఫీజులు, ఏవైనా అదనపు ఛార్జెస్ ఉన్నాయా అన్నది ముందుగానే క్లియర్‌గా చూపిస్తారు. తర్వాత ఏదైనా సర్ప్రైజ్ ఛార్జెస్ ఉండవని నిశ్చయంగా చెప్పవచ్చు.
ఇంకా ఇంకెన్ని ఫైనాన్షియల్ సర్వీసులు?
ఇది కేవలం పర్సనల్ లోన్‌కు మాత్రమే కాదు. బజాజ్ మార్కెట్స్‌లో మీరు క్రెడిట్ కార్డులు, ఇన్సూరెన్స్ పాలసీలు, మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్ సర్వీసులు, చిన్న చిన్న పొలిసీలు (పాకెట్ ఇన్సూరెన్స్), ఎలక్ట్రానిక్స్ ఆర్డర్లు, ఆన్‌లైన్ షాపింగ్ వంటివి కూడా పొందొచ్చు. ఒకే యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఇలా అన్ని అవసరాలకు సరిపోయే విధంగా ఉండటం వల్ల ఇది డిజిటల్ మార్కెట్‌లో ఒక పెద్ద పేరు సంపాదించింది.
టెక్నాలజీ + ఫైనాన్స్ కాంబినేషన్
బజాజ్ ఫిన్సర్వ్ డైరెక్ట్ అనేది ఒక ఫిన్‌టెక్ కంపెనీ. ఇది రెండు ముఖ్య విభాగాల్లో పనిచేస్తోంది. ఒకటి బజాజ్ మార్కెట్స్ (ఫైనాన్షియల్ మార్కెట్ ప్లేస్) మరియు రెండవది బజాజ్ టెక్నాలజీ సర్వీసెస్ (టెక్ సొల్యూషన్స్ ప్రొవైడర్). ఈ కాంబినేషన్ వల్లే వినియోగదారుల అవసరాలను పూర్తిగా అర్థం చేసుకొని వారికి అవసరమైన సర్వీసులు అందించగలుగుతున్నారు.
మొత్తానికి… మీకు అప్పు అవసరమా? టైం వృథా కాకుండా, ఏ బ్యాంక్ బెటర్ ఆఫర్ ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే బజాజ్ మార్కెట్స్ వైపు ఓసారి తప్పక చూసేయండి. తొలిసారి అప్పు తీసుకునే వారు కూడా ధైర్యంగా ముందుకు వెళ్లేలా ఉత్సాహాన్నిస్తుంది. ఇప్పుడు ట్రై చేయకపోతే… మిస్ అయిపోతుందేమో అనే ఫీల్ కలిగేలా సులువైన అవకాశమే ఇది!