APPSC: ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం.. పలు ఉద్యోగ పరీక్షలు వాయిదా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీకి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ గత గురువారం (మే 15) అర్ధరాత్రితో ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని పోస్టులకు 5,77,417 దరఖాస్తులు వచ్చాయి .

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లాలో 39,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా, కడప జిల్లా నుంచి అత్యల్పంగా 15,812 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఇతర రాష్ట్రాల నుంచి 7,159 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది.

మెగా డీఎస్సీకి సంబంధించిన రాత పరీక్షలు జూన్ 6 నుంచి జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన పలు పరీక్షల తేదీలను వాయిదా వేశారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ నియామక పరీక్షలు జూన్ 6, 26 మధ్య వేర్వేరు తేదీల్లో జరగనున్నాయి.

Related News

అయితే, ఈ పరీక్షలు రాస్తున్న వారిలో కొందరు డీఎస్సీకి కూడా సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా, అన్ని పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాలను ఎంచుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, APPSC సంబంధిత పరీక్షలను వాయిదా వేసింది. తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామని APPSC కార్యదర్శి పి రాజా బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మెగా డీఎస్సీలో మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. డీఎస్సీ పరీక్షలకు హాల్ టిక్కెట్లు మే 30 నుండి జారీ చేయబడతాయి. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ రాత పరీక్షలు జూన్ 6 నుండి జూలై 6 వరకు నిర్వహించబడతాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ త్వరలో విడుదల చేయబడుతుంది.