MEGA DSC : పరీక్ష కు సర్వం సిద్ధం ! తెలంగాణ అభ్యర్థులు పోటీ..!

అమరావతి, ఆంధ్రప్రభ: మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. మే 15వ తేదీతో ఆన్లైన్ ఆప్లికేషన్ల నమోదు గడువు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మొత్తం ఎంత మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారన్న డేటా అధికారుల వద్ద ఉండటంతో పరీక్ష కేంద్రాల ఎంపికపై వారు దృష్టి సారించారు. రోజుకి సరాసరి 40 నుంచి 50 వేల మందికి ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించేలా.. ఆ మేరకు కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు. అధికారిక సమాచారం మేరకు.. ఇప్పటి వరకు అన్ని రకాల పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్న టీసీఎస్ అయాన్ వారితో అధికారులు సంప్రదింపులు జరిపారు. జూన్ 6 తేదీ నుంచి జరగనున్న డీఎస్సీ పరీక్షలకు తమ కేంద్రాలను ఇచ్చేందుకు టీసీఎస్ సంస్థ అంగీకరించింది. ఈ కేంద్రాలతోపాటు.. రాష్ట్రంలోని ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ కళాశాల్లలో కూడా డీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వారితోకూడా సంప్రదింపులు జరిపారని సమాచారం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇచ్చిన గడువు కంటే ముందే పూర్తి చేస్తారా?

డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి ఎలాంటి డీవియే షన్స్, షెడ్యూల్ మార్పులు లేకుండా అధికారులు ముందుకెళ్తు న్నారు. వారి స్పీడ్ చూస్తుంటే పరీక్షల కోసం ఇచ్చిన 30 రోజుల షెడ్యూల్ కంటే ముందే పూర్తిచేసేలా ఉన్నారు. ఇప్పటికే టీసీఎస్ ఆయాన్ కేంద్రాలు ఎంపికచేయగా.. వాటి సామర్థం రోజుకి సరాసరి 20 వేల మందికి రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించగలరు. ఇక వీటితోపాటు ఇంజినీరింగ్ కళాశాలలు అందుబాటులోకి వస్తే మరో 20 నుంచి 30 వేల మందికి ఒకేరోజు పరీక్షలు జరిపే వెసులుబాటు ఉంటుంది. ఈ లెక్కన రోజుకి 40 వేల మంది చొప్పున చూసుకున్నా.. గరిష్టంగా 20 రోజులు కూడా పరీక్షల నిర్వహణకు ఎక్కువే.

Related News

తొలిసారి ఎస్సీ వర్గీకరణతో పోస్టులు..

కూటమి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ ఈ డీఎస్సీ నోటిఫికేషన్ నుంచే అమలు చేశారు. ఆ మేరకు పోస్టులను ప్రకటించగా.. ఎంత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అన్నది కూడా అధికారులు తెలియజేశారు. ఎస్సీ జీఆర్ 1, జీఆర్ 2, జీఆర్ 3 కింద మూడు కేటగిరీల్లో వరుసగా.. 1848, 45419, 61905 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేశారు. ఇక మొత్తం 16,347 ఉద్యోగాలకు 3,35,401 మంది అభ్యర్థులు వివిధ పోస్టులకు కలిపి 5,77,417 దరఖాస్తులను నమోదు చేశారు. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు సరాసరి 35 మంది పోటీ పడనున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ల నమోదులో మహిళలు ముందంజలో ఉన్నారు. దాదాపు 2,03,647 మంది మహిళా అభ్యర్థులు, 1,31,754 మంది పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు ఎస్సీఆర్టీ డైరెక్టర్, డీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 30వ తేదీ నాటికి హాల్ టికెట్లు విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఏపీ డీఎస్సీకి తెలంగాణ అభ్యర్థుల పోటీ!

20% నాన్లోకల్ కోటా పోస్టులకు దరఖాస్తు

ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ కొలువు సాధించేందుకు ఏపీ డీఎస్సీకి సైతం తెలంగాణ అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయగా. మొత్తం 3.35 లక్షల మంది దరఖాస్తు చేశారు. వారిలో ఇతర రాష్ట్రాల నుంచి 7,159 మంది ఉన్నారు. అందులో సుమారు 7 వేల మంది తెలంగాణ నుంచే ఉంటారని అంచనా. ఏపీలో 20 శాతం పోస్టులు నాన్లోకల్ కోటా కింద కేటా యించారు. వాటికి స్థానికులతోపాటు ఏ రాష్ట్రం వారైనా పోటీపడొచ్చు. కాక పోతే పదో తరగతిలో ద్వితీయ భాషగా తెలుగు చదవడం తప్పనిసరి. ఎక్కు వగా ఏపీకి సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, గద్వాల, నారా యణపేట జిల్లా అభ్యర్ధులు ఉన్నారని, వారితోపాటు రంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట జిల్లాల నుంచి కొందరు అభ్యర్థులు దరఖాస్తు చేశారని సమాచారం తెలంగాణ డీఎస్సీలో కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగం రానివారే ఎక్కువ మంది దరఖాస్తు చేశారని తెలుస్తోంది జూన్ 6 నుంచి జులై 6వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు.