GOOD NEWS: తిరుపతి IITకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..రూ.2,313 కోట్ల నిధులు..

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలలో తిరుపతి ఐఐటీ విస్తరణకు ఆమోదం తెలిపిన విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో నేడు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తిరుపతి ఐఐటీకి రూ.2,313 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఐఐటీ డైరెక్టర్ కె.ఎన్. సత్యనారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో ఐఐటీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అన్నారు.అయితే, 2015లో తిరుపతికి కేంద్ర ప్రభుత్వం ఐఐటీని మంజూరు చేసిందని, 2017 నుంచి 2024 వరకు దాదాపు రూ.1,100 కోట్ల నిధులు మంజూరు చేశామని ఆయన తెలిపారు.

ఏర్పేడులోని ఐఐటీ క్యాంపస్‌లో 2017 నుంచి అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. సుమారు 12 వేల మంది విద్యార్థులకు వసతి కల్పించడంతో పాటు, ఆ నిధులు విద్య, బోధనకు ఎంతో దోహదపడతాయని అన్నారు.

Related News