ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా AP ECET-2025 ప్రవేశ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. దీనిని 110 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) తాజాగా (మే 15) ECET-2025 ఫలితాలను విడుదల చేసింది. AP ECET-2025 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_GetResult.aspx ని చెక్ చేయవచ్చు.
ఈ క్రమంలో, అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ఫలితాన్ని తనిఖీ చేయవచ్చు.
ఈ ఫలితాల్లో మొత్తం 35,187 మంది అభ్యర్థులు పరీక్షకు రాయగా, వారిలో 31,922 మంది పాస్ అయ్యారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన కట్లే రేవతి 169 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. అంతేకాకుండా.. 2వ, 3వ, 4వ ర్యాంకులు కూడా తెలంగాణ విద్యార్థులకే దక్కడం గమనార్హం.
Related News
APECET 2025 ప్రవేశ పరీక్షలో పాలిటెక్నిక్ డిప్లొమా, B.Sc (గణితం) అభ్యర్థులకు 2025-2026 విద్యా సంవత్సరానికి లాటరల్ ఎంట్రీ ద్వారా BE/B.Tech/B.ఫార్మసీ కోర్సుల రెండవ సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. కాగా, అడ్మిషన్ల కోసం AP ECET 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో విడుదల చేయనున్నారు.