Property: తండ్రి ఆస్తిపై కూతురికి హక్కు లేదు?.. ఈ రూల్స్ అదే చెబుతున్నాయి…

ఇప్పటి రోజుల్లో ఆస్తి అంటే మనుషుల మధ్య సంబంధాలకన్నా పెద్ద విషయంగా మారిపోయింది. ఒకప్పుడు కలిసి తిరిగిన కుటుంబాలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు – ఇప్పుడు ఆస్తి విషయంలో ఎదో ఒక సమస్యతో న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా తండ్రి ఆస్తి ఎవరికి దక్కాలి? ఎవరికీ దక్కకూడదు? అనే చర్చ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుమార్తెలకు కూడా తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కానీ ఈ హక్కులు ప్రతిసారీ వర్తించవు. ఎందుకంటే… కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల వలన ఎంతో మంది కుమార్తెలు తండ్రి ఆస్తిని కోల్పోయే పరిస్థితిలోకి వచ్చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మీరు కుమార్తె అయితే మీకు తండ్రి ఆస్తిలో హక్కు ఉందా లేదా అన్నది ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే న్యాయపరంగా మీరు ఎదో గొప్ప హక్కులు ఉన్నట్టు భావించి చివరికి కోర్టులో ఓటమి చెందే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినది ఏమిటంటే – ఆ ఏడు ముఖ్యమైన కారణాలు ఏవి. ఇవి ఉన్నపుడు మీకు ఆస్తిపై హక్కు ఉండదు.

Related News

తండ్రి సొంత సంపాదన అంటే ఏమిటి?

చాలా మంది అనుకునే ఒక పొరపాటు ఏమిటంటే – తండ్రి దగ్గర ఉన్న ఆస్తి మొత్తం మనదే అని. కానీ నిజానికి తండ్రి తన జీవితంలో స్వయంగా సంపాదించిన ఆస్తి పై ఆయనకే పూర్తి హక్కు ఉంటుంది. అంటే, ఆయన ఆస్తిని అమ్మడం, గిఫ్ట్‌గా ఇవ్వడం లేదా ఎవరికీ ఇవ్వకుండా తన పేరు మీదే ఉంచడం – అన్నీ ఆయన స్వేచ్ఛ. ఈ తరహా ఆస్తిపై కుమార్తెలకు చట్టపరంగా హక్కు ఉండదు.

కానీ అదే పూర్వీకుల ఆస్తి అయితే పరిస్థితి మారుతుంది. ఎందుకంటే పూర్వీకుల ఆస్తి అనేది తండ్రికి వారసత్వంగా వచ్చినది. దానిలో కుమార్తెలకు కూడా హక్కు ఉంటుంది – అది చట్టం చెప్పింది. కానీ… వీలునామా లేని సందర్భంలో మాత్రమే.

వీలునామా ఉంటే పరిస్థితి మారిపోతుంది

తండ్రి తన ఆస్తిపై ఒక చట్టబద్ధమైన వీలునామా రాసి ఉంటే… దాంట్లో ఎవరికి ఆస్తి ఇవ్వాలో స్పష్టంగా పేర్కొని ఉంటే… అప్పుడు ఆ వీలునామాకు చట్టపరంగా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే, ఆస్తిని కుమార్తెకు ఇవ్వకూడదు అని అందులో చెప్పి ఉంటే, ఆమెకు ఆస్తిలో హక్కు ఉండదు. కానీ ఆ వీలునామా మోసపూరితంగా లేదా ఒత్తిడితో రాసిందని భావిస్తే, ఆమె కోర్టులో సవాలు చేయవచ్చు.

2005కి ముందు పంపకాలు జరిగితే?

ఇక్కడ మరో ప్రధానమైన విషయం ఏమిటంటే – హిందూ వారసత్వ సవరణ చట్టం 2005లో వచ్చిందని మనకు తెలుసు. ఆ చట్టం వచ్చిన తర్వాత కుమార్తెలకు కూడా సమాన హక్కు వచ్చింది. కానీ… అదే చట్టం 2005కి ముందు విభజించబడ్డ ఆస్తులపై వర్తించదు. అంటే ఆస్తిని అప్పటికే అన్నదమ్ముల మధ్య పంచుకున్నట్లైతే, కుమార్తె దానిని తిరిగి డిమాండ్ చేయలేరు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఇదే చెప్పింది. గతంలో సెటిల్ అయిన విషయాలను మళ్ళీ తెరుస్తే అది చట్ట విరుద్ధం అవుతుంది.

బహుమతిగా ఇచ్చిన ఆస్తులు కూడా కవర్ కావు

తండ్రి లేదా పూర్వీకులు ఆస్తిని గిఫ్ట్ డీడ్ ద్వారా ఎవరికైనా ఇచ్చి ఉంటే, దానిపై కూడా కుమార్తె హక్కు చూపలేరు. గిఫ్ట్ డీడ్ అనేది చట్టబద్ధమైన దస్తావేజు కాబట్టి, ఒకసారి ఇచ్చిన ఆస్తి తిరిగి తీసుకోలేరు. దాంతో పాటు, ఆ గిఫ్ట్‌ను చట్టం తిరస్కరించదు. ఇది కూడా ఆమెకు ఒక అడ్డంకిగా మారుతుంది.

స్వచ్ఛందంగా హక్కును వదులుకుంటే?

చాలా సందర్భాల్లో కుటుంబంలో ఒత్తిడి వల్ల కొందరు కుమార్తెలు తాము ఆస్తిపై హక్కు కోల్పోతామని అంగీకరించి దస్తావేజుపై సంతకం చేస్తారు. ఆ స్థానంలో వారు డబ్బు లేదా ఇతర వస్తువులు తీసుకోవచ్చు. అలా సంతకం చేస్తే, వారు ఆస్తిలో హక్కును కోల్పోయినట్టే. కానీ, ఈ అంగీకారం ఒత్తిడితో జరిగిందని ఆధారాలు ఉంటే మాత్రం, ఆ పత్రాన్ని కోర్టులో సవాలు చేయవచ్చు.

స్థిరపరిచిన ఆస్తులు అంటే ఏమిటి?

తండ్రి ఆస్తిని ట్రస్ట్‌గా మార్చినట్లైతే, లేదా చట్టబద్ధంగా వేరే వ్యక్తికి బదిలీ చేసినట్లైతే, ఆస్తిపై కుమార్తెలకు హక్కు ఉండదు. ఈ తరహా ఆస్తులు ‘‘స్థిరపరిచిన ఆస్తులు’’ అనే కేటగిరీలోకి వస్తాయి. ఈ ఆస్తులపై వారసత్వ హక్కు వాదించలేరు. చట్టం కూడా ట్రస్ట్ లేదా బదిలీలను గౌరవిస్తుంది.

కుమార్తెలు ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు

ఇప్పటి తరుణంలో చాలా మంది కుమార్తెలు తమకు తండ్రి ఆస్తిలో చట్టపరంగా హక్కు ఉందని భావించి వెంటనే కోర్టులో కేసులు వేస్తున్నారు. కానీ ఆస్తి స్వభావం ఏంటి? అది ఎవరి పేరుపై ఉంది? పంపకం జరిగిందా? వీలునామా ఉందా? అన్నదానిపై ఆధారపడి ఆమె హక్కు నిర్ణయించబడుతుంది. ప్రతి కేసు వేరు. అందుకే, ఆస్తి విషయంలో ముందుగా చట్టపరంగా స్పష్టత తెచ్చుకోవడం ఎంతో అవసరం. లేకపోతే, న్యాయపరంగా కూడా ఓటమి చెందే ప్రమాదం ఉంటుంది.

చివరి మాట

హిందూ వారసత్వ చట్టం 2005 వచ్చిన తర్వాత లింగ సమానత్వం అనే నినాదం న్యాయ వ్యవస్థలో ప్రతిధ్వనించింది. కానీ… చట్టం ఎప్పుడూ కొన్ని నియమాల పరంగా మాత్రమే పని చేస్తుంది. ఎవరికైనా హక్కు ఉండాలంటే, దానికో మద్దతు ఉండాలి. అది ఆస్తి పత్రం కావచ్చు, చట్టం చెప్పిన నియమాల ప్రకారం అర్హత కావచ్చు. కాబట్టి మీరు తండ్రి ఆస్తిపై హక్కు కోరుతున్నారంటే… ముందు మీ చట్టపరమైన స్థితిని సమీక్షించుకోండి. లేకపోతే, చట్టం మిమ్మల్ని రక్షించదనే గుణపాఠం మాత్రమే మిగిలిపోతుంది.