KIWI FRUIT: కివితో బోలెడన్నీ బెనిఫిట్స్‌.. రోజుకు ఒక్కటి తింటే..?

కివి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. దీనిని పోషకాల గనిగా పిలుస్తారు. కివి పండులో విటమిన్ సి, కె, విటమిన్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కివి పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఈ పండ్లలో ఒకదాన్ని తినడం వల్ల మీకు ఊహించని ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ అద్భుతమైన పండ్లను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కివి పండులో విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. కివి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది.

కివి పండులో పొటాషియం కంటెంట్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా రక్తపోటు నియంత్రించబడుతుంది, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్ర చాలా ముఖ్యం. కివి పండులో సెరోటోనిన్ హార్మోన్ ఉంటుంది. ఇది మంచి నిద్రను కలిగిస్తుంది.

Related News

కివి పండులో విటమిన్ సి కంటెంట్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది.

కివి పండులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. కివి పండులోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి కూడా మంచివి. కివి పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

కివి పండులో యాక్టినిడిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. కివి పండులో సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ ఉంటుంది, ఇది నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, కివి పండు తినడం వల్ల నిద్ర నాణ్యత, నిద్ర వ్యవధి మెరుగుపడుతుంది.