Viral Video: అమెజాన్ అడవిలో అనకొండ ఎలా కదులుతుందో చూశారా..!

వైరల్ వీడియో: ప్లాములంటేనే భయపడే మనకు, అనకొండ అనే పేరు వినగానే భయంతో వణుకు వచ్చేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా గుర్తింపు పొందిన అనకొండపై ఇప్పటికే చాలా హాలీవుడ్ సినిమాలు తీశారని తెలిసిందే. అనకొండ అనే సినిమా హాలీవుడ్ లో చాల పెద్ద హిట్ సినిమా గా పేరొచ్చింది..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇంత భారీ అనకొండ నిజంగా మన కళ్ళ ముందు కనిపిస్తే? ఊహించడానికే భయంగా ఉంది! ఇటీవల, అమెజాన్ వర్షారణ్యంలో ఒక భారీ అనకొండ కనిపించి సంచలనం సృష్టించింది. వీడియో కూడా కాప్చర్ చేసారు..

దట్టమైన అమెజాన్ అడవి మధ్యలో ఉన్న నదిలో ఈత కొడుతున్న భారీ అనకొండ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యాన్ని హెలికాప్టర్ నుండి చిత్రీకరించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. నీటిలో ఈత కొడుతున్న అనకొండ మరియు దాని భారీ శరీర ఆకారం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.

దూరం నుండి చూసినప్పుడు మాత్రమే ఇంత భారీ అనకొండ భయానకంగా ఉంటుంది. దగ్గరగా చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. నదిలో వేగంగా ఈత కొడుతున్న అనకొండ వీడియో చూసిన నెటిజన్లు “ఇది నిజమేనా?” అని ఆలోచిస్తున్నారు. ఇది హాలీవుడ్ సినిమాలోని సన్నివేశాన్ని చూస్తున్నట్లుగా ఉందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.