వేసవి రోజుల్లో చల్లగా, టేస్టీగా ఏదైనా తినాలనిపిస్తుందికదా. అందులోనూ మామిడి పండుతో అయితే ఇంకా చల్లగాను, రుచిగాను ఉంటుంది. బయట దొరికే మ్యాంగో ఐస్‌క్రీమ్ ఖరీదుగా ఉండడమే కాదు, అందులో కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే టిప్‌తో, మీరు ఇంట్లోనే చాలా ఈజీగా, స్టవ్ కూడా అవసరం లేకుండా, కేవలం మిక్సీతోనే మ్యాంగో ఐస్‌క్రీమ్ తయారు చేసుకోవచ్చు. దీని టేస్ట్ ఎంతగా వుంటుందంటే. మీరు ఒక్కసారి చేస్తే.. ఇంట్లో పిల్లలూ, పెద్దలూ మళ్లీ మళ్లీ అడుగుతారు. ఈ సమ్మర్ స్పెషల్‌గా ఈ ఐస్‌క్రీమ్ ఓసారి ట్రై చేయండి.. టేస్ట్ మరిచిపోలేరు!
ఇంట్లో ఐస్‌క్రీమ్ అంటే కష్టమే అనుకునేవాళ్లకో స్పెషల్ రెసిపీ
ఒకప్పుడు ఐస్‌క్రీమ్ అంటే కచ్చితంగా స్టవ్ మీద పాలు మరిగించాలి, కస్టర్డ్ కలపాలి, ఫ్రిజ్‌లో కొన్ని గంటలు ఉంచాలి అని చాలా మందికి తెలియడం వలనే ఐస్‌క్రీమ్ చేయడం కష్టమనిపిస్తుంది. కానీ ఇప్పుడు చెప్పే పద్ధతిలో మాత్రం మామిడిపండ్లు ఉంటే చాలు.. బేసిక్ పదార్థాలతో కేవలం మిక్సీ సహాయంతో టేస్టీ ఐస్‌క్రీమ్ రెడీ చేయొచ్చు. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ సంతృప్తి ఇచ్చే డెజర్ట్‌లలో ఒకటి.
మామిడి మాధుర్యంతో మైమరచే ఐస్‌క్రీమ్ మిక్స్ ఇలా తయారు చేయండి
ముందుగా బాగా పండిన మామిడిపండ్లను తీసుకుని శుభ్రంగా కడగాలి. పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వీటిలో తీపి బాగా ఉండే పండ్లు అయితే ఐస్‌క్రీమ్ టేస్ట్ ఇంకా ఎక్కువగా బాగుంటుంది. తరువాత మిక్సీలో కాచి చల్లార్చిన పాలు పోయాలి. వీలైతే పాలు బాగా చిక్కగా ఉండాలి. ఇప్పుడు అందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇది కేక్‌లకు వాడే విప్పింగ్ క్రీమ్ కాదు. మార్కెట్‌లో దొరికే ఫ్రెష్ క్రీమ్ లేదా మీ ఇంట్లో పాలమీగడ అయితే చాలు. ఇప్పుడు అందులో మామిడి ముక్కలు, పాల పొడి, పంచదార వేసి బాగా బ్లెండ్ చేయాలి. మిక్స్ సిల్కీగా, స్మూత్‌గా ఉండాలి. ముక్కలు మిగిలిపోకూడదు.
ఒక్కసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇదిగో ఇలా చేయండి
బ్లెండ్ చేసిన మ్యాంగో మిక్స్‌ను ఒక గాజు బౌల్ లేదా ప్లాస్టిక్ కంటైనర్‌లో వేసి మూత పెట్టి ఫ్రీజర్‌లో 6 గంటలు పెట్టాలి. ఆ తరువాత బయటికి తీసి మళ్లీ మిక్సీలో వేసి మరోసారి బ్లెండ్ చేయాలి. ఇలా రెండుసార్లు గ్రైండ్ చేయడం వల్ల ఐస్‌క్రీమ్ టెక్స్చర్ మరింత క్రీమీగా, మెల్ట్ అయ్యేలా ఉంటుంది. ఇప్పుడు మామిడి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ తరిగినవి కలిపి ఈ మిశ్రమంలో కలపాలి.
ఇప్పుడు అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది!మ
ఇలా తయారైన మిశ్రమాన్ని సమానంగా గాజు లేదా ప్లాస్టిక్ డబ్బాలో పోయాలి. పైగా డ్రైఫ్రూట్స్ చల్లి, బటర్ పేపర్ లేదా సిల్వర్ ఫాయిల్‌తో కవర్ చేసి మూత పెట్టాలి. ఇది ఓవర్నైట్ ఫ్రీజర్‌లో పెట్టాలి. అంటే కనీసం 10 గంటలపాటు ఫ్రీజ్ చేయాలి. మరుసటి రోజు దాన్ని బయటకు తీసి సర్వ్ చేస్తే.. బాస్, మీ ఇంట్లో టేస్ట్ బాంబ్ పేలినట్లే! ఒక్కసారి తిన్న తర్వాత మళ్లీ తినాలనిపించేస్తుంది.
ఇంట్లో పిల్లల ఫేవరెట్ అయ్యే చక్కని ఐస్‌క్రీమ్
పిల్లలు ఐస్‌క్రీమ్ అంటే బాగా ఇష్టపడతారు. కానీ బయట ఐస్‌క్రీమ్ వల్ల కోల్డ్, ఫ్లేవర్స్ వల్ల హెల్త్ ఇష్యూలు ఉండొచ్చు. కానీ ఈ మ్యాంగో ఐస్‌క్రీమ్ మాత్రం శుద్ధమైన పదార్థాలతో, ఇంట్లో తయారవుతుంది కాబట్టి నమ్మకంగా పిల్లలకు ఇస్తూ మీరు కూడా తింటూ ఎంజాయ్ చేయవచ్చు.
ఇంకా బెటర్ టేస్ట్ కోసం ఈ చిట్కాలు పాటించండి
బాగా పండిన మామిడిపండ్లు వాడండి. తీపి తక్కువగా ఉంటే పంచదార కొంచెం ఎక్కువగా వేసుకోండి. లేకపోతే బెల్లంతో కూడా మీరు స్వీట్‌నెస్ పొందవచ్చు. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే, చిక్కటి పాల మీగడ కూడా అదే పనితీరు ఇస్తుంది. పాలను ముందుగా బాగా మరిగించి చల్లార్చి వాడితే టేస్ట్ డబుల్ అవుతుంది.
ఈ వేసవిలో ఈ ఐస్‌క్రీమ్ చేయడం మర్చిపోవద్దు
ఇంత ఈజీగా, ఈ టేస్టీగా ఐస్‌క్రీమ్ ఇంట్లోనే తయారుచేసుకోవడం అంటే మనమే షెఫ్ అన్న మాట! ఈ వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి ఐస్‌క్రీమ్ తయారీ ఎంజాయ్ చేయండి. వారిలో క్రియేటివిటీ పెరుగుతుంది. మాములుగా తినే మామిడిపండ్లను ఇలా కొత్తగా వాడితే, ఆరోగ్యానికి మంచిదే కాదు.. ఇంట్లో శబ్దంగా, చల్లగా ఓ ఫ్యామిలీ మోమెంట్ కూడా క్రియేట్ అవుతుంది.
ఒక్కసారి ఈ మ్యాంగో ఐస్‌క్రీమ్ ఇంట్లో చేసిచూడండి.. మళ్లీ బయట దొరికేది మీకు నచ్చకపోవచ్చు! ఫ్రెష్ మ్యాంగో టేస్ట్‌తో కూడిన స్వీట్ మధురానుభూతి మీ నాలుకని తడిమేస్తుంది. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్, రిలేటివ్‌లతో కూడా షేర్ చేయండి.. వేసవిలో అందరూ చల్లగా ఉంటారు!
మీరు కూడా ఈ వేసవిలో ఒకసారి ట్రై చేస్తారా?