మే 22న లండన్‌లో జరిగే గ్లోబల్ ఈవెంట్‌లో హానర్ తన కొత్త హానర్ 400 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ఈవెంట్ బుధవారం సాయంత్రం 4 గంటలకు (IST రాత్రి 8:30 గంటలకు) ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్‌ను కంపెనీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. హానర్ 400 సిరీస్‌లో రెండు ఫోన్‌లు ఉంటాయి. అవి హానర్ 400, హానర్ 400 ప్రో. దీని కోసం కంపెనీ టీజర్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఈ ఫోన్‌లలో 200MP అల్ట్రా క్లియర్ AI కెమెరా ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. హానర్ 400 మోడల్ డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉండగా, ప్రో మోడల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీనికి టెలిఫోటో కెమెరా ఉండే అవకాశం ఉంది. డిజైన్ పరంగా, రెగ్యులర్ మోడల్ ఫ్లాట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది, అయితే ప్రో మోడల్ కర్వ్డ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
HONOR 400 స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. HONOR 400 మోడల్ 6.55-అంగుళాల FHD+ 120Hz ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే, 5000 nits పీక్ బ్రైట్‌నెస్, స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్‌సెట్, 200MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, IP65 నీరు, ధూళి నిరోధకత, 5300mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అదేవిధంగా HONOR 400 Pro స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. HONOR 400 Pro మోడల్ 6.7-అంగుళాల FHD+ 120Hz ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 200MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 5300mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉందని నివేదించబడింది.
గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్, AI సమ్మరీ, AI సూపర్ జూమ్, AI పోర్ట్రెయిట్ స్నాప్, AI ఎరేజర్ వంటి ఆధునిక AI ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉంటాయని నివేదించబడింది. ఇంగ్లాండ్‌లో ఇప్పటికే ప్రీ-రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. లాంచ్ తర్వాత వాటి అమ్మకాలు ప్రారంభమవుతాయి. హానర్ 400 సిరీస్‌ను త్వరలో మలేషియాలో కూడా ప్రారంభించవచ్చని కంపెనీ సూచిస్తుంది. అంతేకాకుండా, హానర్ భారత మార్కెట్లో ఐదు కొత్త ఉత్పత్తుల విడుదలకు అనుమతులు పొందిన నేపథ్యంలో, ఈ ఫోన్‌లను త్వరలో భారతదేశంలో విడుదల చేసే అవకాశం ఉంది.