
Samsung మరోసారి తన ఫోల్డబుల్ సిరీస్‌తో మార్కెట్‌ను షేక్ చేయబోతోంది. ఈసారి కొత్త డిజైన్, తక్కువ బరువు, అత్యాధునిక ఫీచర్లు మరియు శక్తివంతమైన కెమెరాలతో Z Fold7 మరియు Z Flip7 లాంచ్‌కి రెడీ అవుతున్నాయి. జూలై 9న ఈ రెండు ఫోన్లు గ్రాండ్‌గా రిలీజ్ కానున్నాయి.
Galaxy Z Fold7 గురించి వస్తున్న లీక్స్ ప్రకారం, ఇది ఇప్పటివరకు వచ్చిన ఫోల్డబుల్ ఫోన్లలోనే అత్యంత సన్నగా ఉండే అవకాశం ఉంది. ఫోన్‌ను ఫోల్డ్ చేసినపుడు దీని మందం కేవలం 8.2mm నుంచి 8.9mm మధ్య ఉండొచ్చు. ఓపెన్ చేసినపుడు 4.2mm మాత్రమే. గత మోడల్ Fold6 మాత్రం ఫోల్డ్ చేసినపుడు 12.1mm ఉండేది. ఇది చూస్తే Fold7 డిజైన్ పరంగా వణుకు పుట్టించబోతున్నది.
Fold6 ఫోన్ బరువు 239 గ్రాములు కాగా, Fold 7 కేవలం 215 గ్రాముల వరకు ఉండొచ్చు. అంటే ఒక పెద్ద డిస్ప్లే ఉన్న ఫోన్ అయినప్పటికీ చాలా తక్కువ బరువుతో అందుబాటులోకి రానుంది. చేతిలో బరువు లేనట్టు ఉంటుంది, జేబులో పెట్టుకునే సౌలభ్యం ఉంటుంది.
[news_related_post]ఈ స్థాయిలో సన్నగా ఉండే ఫోన్ రూపొందించడానికి Samsung కొత్త హింజ్ మెకానిజాన్ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఫోన్ బాడీకి కొత్త Armor Aluminum ఫ్రేమ్ మరియు గ్లాస్-సిరామిక్ బ్యాక్ ప్యానల్ వాడినట్టు సమాచారం. దీని వలన ఫోన్ బలంగా ఉండి, లుక్స్ పరంగా మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.
ఈసారి కెమెరా సెక్షన్లో భారీ మార్పులు జరుగుతున్నాయి. Fold6లో 50MP ప్రధాన కెమెరా ఉండగా, Fold7లో 200MP కెమెరా ఉండబోతోంది. ఇది ప్రొఫెషనల్ లెవెల్ ఫోటోలు తీసుకురానుంది.
అంతేకాకుండా, ఈసారి ఇన్నర్ డిస్ప్లే 8 అంగుళాలది కాగా, ఔటర్ డిస్ప్లే 6.5 అంగుళాలదిగా ఉండనుంది. రెండు స్క్రీన్లకు 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ బ్రైట్నెస్ లభించనుంది. స్క్రీన్ క్రీజ్ (మడతలో వచ్చే లైన్) చాలా తక్కువగా ఉండేలా డిజైన్ చేసినట్లు సమాచారం.
Fold7లో Snapdragon 8 Gen 4 ఆధారంగా రూపొందించిన ప్రత్యేకమైన Snapdragon 8 Elite for Galaxy ప్రాసెసర్ ఉండబోతోంది. ఫోన్ Android 16 ఆధారంగా One UI 8.0తో వస్తుంది. ఇందులో Galaxy AI ఫీచర్ల అప్‌గ్రేడ్ వర్షన్ ఉంటుంది. కాల్ ట్రాన్స్లేషన్, టాస్క్ ఆటోమేషన్, స్మార్ట్ కమెరా ఫీచర్లు మరింత మెరుగవుతాయి.
Fold7 ఫోన్లో 4,400mAh బ్యాటరీ ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇది Fold6లో ఉన్న బ్యాటరీ కెపాసిటీతో సమానమే. అలాగే 25W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్ ఉండేలా కనిపిస్తోంది. బ్యాటరీ పరంగా ఎలాంటి పెద్ద అప్‌గ్రేడ్ లేదన్నది కొంతమందికి నిరాశ కలిగించొచ్చు.
Fold7తో పాటు Galaxy Z Flip7 పై కూడా భారీ ఆసక్తి నెలకొంది. ఇది క్లామ్‌షెల్ డిజైన్‌లో వచ్చిన ఫోన్. లీక్స్ ప్రకారం, ఇది కూడా తక్కువ మందంతో విడుదల కానుంది. Flip6లో ఫోల్డ్ చేసినపుడు మందం 14.9mm ఉండగా, Flip7లో కేవలం 13.7mm మాత్రమే. ఓపెన్ చేసినపుడు కేవలం 6.5mm ఉండే అవకాశం ఉంది. బరువు కూడా కేవలం 188 గ్రాములుగా ఉండబోతోంది.
ఈసారి Flip7లో 4 నుంచి 4.1 అంగుళాల ఔటర్ స్క్రీన్ ఇవ్వబోతున్నారు. ఇది Flip6లో ఉన్న 3.4 అంగుళాల స్క్రీన్‌తో పోలిస్తే చాలా పెద్దది. అంతేకాకుండా, ఇన్నర్ స్క్రీన్ 6.9 అంగుళాలదిగా ఉండనుంది. సోషల్ మీడియా, వీడియోలు చూసే వాళ్లకు ఇది అదిరే అనుభూతిని ఇస్తుంది.
Flip6లో కేవలం 3,700mAh బ్యాటరీ ఉండేది. Flip7లో మాత్రం 4,300mAh బ్యాటరీ ఇవ్వబోతున్నారట. ఫోన్ చాలా తన్నీగా ఉన్నా, అంత పెద్ద బ్యాటరీ ఇవ్వడం నిజంగా ఆశ్చర్యం కలిగించనుంది.
Flip7లో Samsung సొంతంగా రూపొందించిన Exynos 2500 చిప్ ఉండబోతోంది. దీనితో పాటు 12GB RAM ఉంటుంది. ఇది ఫోల్డబుల్ ఫోన్‌కి పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ను అందిస్తుంది.
Samsung Galaxy Z Fold7 మరియు Flip7 ఈసారి సన్నగా, తక్కువ బరువుతో, శక్తివంతమైన కెమెరా, ప్రాసెసర్, AI ఫీచర్లతో మార్కెట్లో సంచలనం రేపేందుకు సిద్ధంగా ఉన్నాయి. జూలై 9న లాంచ్ కానున్న ఈ ఫోన్లు ₹1.4 లక్షల దగ్గరగా ధరలతో స్టార్ట్ కావచ్చని అంచనా. మీరు ఫ్యూచర్ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటే, ఈ డీల్స్ మిస్ అవ్వకండి…