శాంసంగ్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ F56 5Gని భారతదేశ మార్కెట్లో అధికారికంగా విడుదల అయింది. ఈ మోడల్ గతంలో విడుదలైన గెలాక్సీ M56కి అప్‌డేట్. ఇందులో 6.7-అంగుళాల FHD+ 120Hz సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది గరిష్టంగా 1200 నిట్‌ల బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే, ఈ ఫోన్ Exynos 1480 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనికి AMD Xclipse 530 GPU మద్దతు ఇస్తుంది. ఇది 8GB RAM మరియు 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా, ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ UI 7పై నడుస్తుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. ఇక వెనుక 2MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 45W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0 టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. అయితే, ఫోన్ బాక్స్‌లో ఛార్జర్ అందించబడలేదు. భద్రత పరంగా, దీనికి ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. కనెక్టివిటీ పరంగా, USB టైప్-సి ఆడియో, బ్లూటూత్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Related News
గెలాక్సీ F56 5G ఫోన్ ఆకుపచ్చ, వైలెట్ రంగులలో లభిస్తుంది. ఈ ఫోన్ ధరల విషయానికొస్తే.. 8GB + 128GB వేరియంట్ ధర రూ. 27,999గా నిర్ణయించబడింది. అంతేకాకుండా.. 8GB + 256GB వేరియంట్ ధర రూ. 30,999గా ఉంది. ఈ ఫోన్ శామ్‌సంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో, ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్‌లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. పరిచయ ఆఫర్‌లలో భాగంగా, వినియోగదారులు రూ. 2,000 తక్షణ బ్యాంక్ తగ్గింపును పొందవచ్చు. అదనంగా, నెలకు రూ. 1,556 నుండి ప్రారంభమయ్యే EMI ఎంపికలు Samsung Finance+ ఇతర ప్రముఖ NBFC భాగస్వాముల ద్వారా కూడా ఈ ఫోన్ ను కొనుగోలు చేయొచ్చు.