ఇప్పుడు భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. మూడు రోజులుగా భారత సైన్యం పాకిస్తాన్‌ను తీవ్ర ఒత్తిడిలో పెట్టింది. ఆసిం మునీర్ నేతృత్వంలోని పాకిస్తాన్ సైన్యం భారత హస్తం చూసి భయంతో వణికిపోతోంది. ఎందుకంటే.. భారతదేశం దగ్గర ఉన్న ఆధునిక ఆయుధాల గురించి విన్న వాళ్లు కంగారు పడిపోతున్నారు. ఈ శక్తివంతమైన ఆయుధాలు ఒక్కసారి ఉపయోగంలోకి వస్తే, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయే అవకాశం ఉంది. ఈ ఖతర్నాక్ ఆయుధాల వివరాలు ఇప్పుడు చూద్దాం.
భారత శక్తిని చూపించే బ్రహ్మోస్ క్షిపణి
భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి ప్రపంచంలోనే వేగవంతమైన క్రూజ్ మిసైల్‌గా పేరు పొందింది. ఇది గంటకు సుమారు 3,400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని పరిధి మొదట 290 కి.మీ.గా ఉండగా, ఇప్పుడు దాన్ని 600 కి.మీ.కి పెంచారు. ఈ క్షిపణి అణ్వాయుధాలను, సాంప్రదాయ వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు. ఇది భూమి మీద నుంచి, నౌకల నుంచి లేదా గాలిలో నుంచి ప్రయోగించవచ్చు. తక్కువ ఎత్తులో వెళ్లడం వల్ల రాడార్లకు ఇది కనిపించదు. అలాగే ఇది టార్గెట్‌ను పూర్తిగా ధ్వంసం చేస్తుంది.
రాడార్‌నే పతనం చేయగల రుద్రం-1
భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన రుద్రం-1 అనే యాంటీ రేడియేషన్ మిసైల్ శత్రు రక్షణ వ్యవస్థల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ క్షిపణిని సుఖోయ్-30 MKI విమానం నుంచి ప్రయోగించవచ్చు. దీని పరిధి 100 కి.మీ. నుంచి 250 కి.మీ. వరకు ఉంటుంది. రాడార్లను గుర్తించి వాటిని నాశనం చేయడంలో ఇది మెలుకువగా పనిచేస్తుంది. స్టెల్త్ డిజైన్ ఉండటం వల్ల ఇది రాడార్ ఫలితాల్లో కనబడదు. శత్రు రక్షణ వ్యవస్థలు ఏవీ ఈ క్షిపణికి ఎదురులా ఉండవు.
ఖతర్నాక్ ఖ-31పి క్షిపణి
ఖ-31పి అనే ఈ క్షిపణిని రష్యా రూపొందించింది. దీన్ని కూడా సుఖోయ్-30 MKI విమానాల నుంచి ప్రయోగించవచ్చు. ఇది 110 నుండి 250 కి.మీ వరకు ప్రయాణించి లక్ష్యాన్ని ధ్వంసం చేయగలదు. ఇది శత్రు రాడార్ సిగ్నల్స్‌ను గుర్తించి వాటిని నాశనం చేస్తుంది. ప్రత్యేకంగా పాకిస్తాన్, చైనా వాడుతున్న HQ-9 రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయగలదు. ఇది తక్కువ ఎత్తులో, అధిక వేగంతో ప్రయాణించడం వలన ఎలాంటి రాడార్‌నైనా తప్పించు కుంటుంది.
ఆకాశం నుంచి ధ్వంసం చేసే స్కై స్ట్రైకర్ డ్రోన్
ఇజ్రాయెల్‌తో కలిసి భారత్ అభివృద్ధి చేసిన స్కై స్ట్రైకర్ డ్రోన్ గాల్లో 6 గంటల పాటు ఉండగలదు. ఇది లక్ష్యాన్ని గుర్తించి స్వయంగా దాడి చేస్తుంది. 20 నుండి 100 కి.మీ పరిధిలో పని చేస్తుంది. ఈ డ్రోన్ చిన్నదిగా ఉండటం, స్టెల్త్ డిజైన్‌తో ఉండటం వలన ఇది రాడార్లకు కనిపించదు. దీనివల్ల శత్రు రక్షణ వ్యవస్థలపై ఖచ్చితమైన దాడులు చేయడం చాలా సులువు అవుతుంది.
బంకర్లపై సమర్థవంతమైన స్కాల్ప్ మిసైల్
ఫ్రాన్స్ దేశం రూపొందించిన స్కాల్ప్ స్టెల్త్ మిసైల్‌ను భారత్ రాఫెల్ విమానాల ద్వారా ప్రయోగిస్తోంది. దీని పరిధి 300 నుండి 560 కి.మీ. వరకు ఉంటుంది. ఇది లోతైన భూగర్భ బంకర్లను కూడా ఛిద్రము చేయగలదు. టెర్రెయిన్ ఫాలోయింగ్ నావిగేషన్ వ్యవస్థతో ఇది కొండల మధ్యలోనూ ప్రయాణించి లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. శత్రువుకు ఇది కనిపించకుండా దాడి చేస్తుంది. ఉగ్రవాద స్థావరాలపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది.
పగలే కాదు రాత్రి దాడికీ సిద్ధం – SPICE 2000
ఇజ్రాయెల్ తయారుచేసిన SPICE 2000 బాంబును మిరాజ్-2000, జాగ్వార్ విమానాల నుంచి ప్రయోగించవచ్చు. ఇది GPS ఆధారిత గైడెన్స్‌తో పనిచేస్తుంది. 60 నుండి 100 కి.మీ పరిధిలో గ్లైడ్ బాంబుగా లక్ష్యాన్ని నాశనం చేస్తుంది. ఇది 2019 బాలకోట్ ఎయిర్‌స్ట్రైక్ సమయంలో వాడారు. ఇది చాలా ఖచ్చితంగా, మౌనంగా లక్ష్యాన్ని ఛేదించగలదు. శత్రు భూభాగంలోకి ప్రవేశించకుండా దూరం నుంచి దాడి చేయడం దీని ప్రత్యేకత.
భయాన్ని పంచే హారోప్ డ్రోన్లు
హారోప్ డ్రోన్లు స్వీయ-విధ్వంసకమైనవి. అంటే టార్గెట్ మీద పడే సరికి తామే పేలిపోతాయి. వీటి పరిధి దాదాపు 1,000 కి.మీ. ఇది 6 గంటల పాటు గాల్లో ఉండగలదు. ఎలక్ట్రో-ఆప్టికల్ సెన్సార్లు ఉండటం వలన పగలు, రాత్రికి తేడా లేకుండా దాడి చేయగలదు. లక్ష్యాన్ని చూసిన వెంటనే దానిపై పడిపోయి దాన్ని నాశనం చేస్తుంది. మనుషుల జోక్యం లేకుండా స్వయంగా పనిచేస్తుంది. ఇది రాడార్ స్టేషన్‌లను ధ్వంసం చేయడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది.
పాకిస్తాన్‌కి ఈ సిస్టమ్స్ కలవరమే
ఈ ఆయుధాలన్నీ కలిసి పాకిస్తాన్‌కి క్షణాల్లో కూలిపోయే ప్రమాదాన్ని తీసుకురాగలవు. ప్రతి ఆయుధం ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు రూపొందించబడి ఉంది. రాడార్‌లు, రక్షణ వ్యవస్థలు, బంకర్లు, ఉగ్ర స్థావరాలు ఏదైనా కావచ్చు.. ఒక్కసారి భారత వైమానిక దళం ఈ ఆయుధాలను ఉపయోగించిన వెంటనే శత్రు వ్యవస్థలు నేల చూపు చూస్తాయి.
ఈ శక్తివంతమైన ఆయుధాల వల్ల పాకిస్తాన్ ఒక్కసారి యుద్ధానికి దిగితే అది చివరి తప్పుగా మారొచ్చు. భారత్ ఇప్పుడు సాంకేతికంగా అత్యంత శక్తివంతమైన దశలో ఉంది. క్షణాల్లో టార్గెట్‌ను ధ్వంసం చేసే సామర్థ్యంతో భారత సైన్యం సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు పాకిస్తాన్ మిత్ర దేశాలపై ఆధారపడి ఉన్నా.. ఈసారి భారత్ శక్తిని చూసి వెనక్కి తగ్గడం తప్ప మరో దారి ఉండదు.
ఇలాంటి ఆధునిక ఆయుధాలు ఉండగానే పాకిస్తాన్ భయంతో వణికిపోతోంది. భారత్ చెయ్యి ఎత్తగానే వారు కూలిపోతారు. యుద్ధం వస్తే ఇది పాకిస్తాన్‌కు చరిత్రలో నిలిచిపోయే ఓ పెద్ద గాయంగా మారవచ్చు. భారత శక్తిని అంచనా వేయడం పాకిస్తాన్‌కు అత్యంత ప్రమాదకర నిర్ణయం అవుతుంది.
మీ అభిప్రాయం ఏమిటి? భారత్ ఈ ఆయుధాలతో పాకిస్తాన్‌ను ఎదుర్కొనగలదా?