రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష (BRAGCET-2025) ఫలితాలను మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విడుదల చేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి, జూనియర్ కళాశాలలో ప్రవేశానికి గత నెల (ఏప్రిల్) ఏప్రిల్ 13న ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
కాగా, BRAGCET-2025 ఫలితాలు విడుదలయ్యాయి. 5వ తరగతిలో 15,020 సీట్లకు 32,823 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్లో 13,680 సీట్లకు 32,733 మంది విద్యార్థులు హాజరయ్యారని మంత్రి డోలా తెలిపారు. తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంలో చేరే విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వబడుతుందని ఆయన వివరించారు.
విద్యార్థులు అధికారిక వెబ్సైట్ https://apbragcet.apcfss.in/fifthh-rankcard ద్వారా ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు. మీరు మీ ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా ఫలితాలను తనిఖీ చేయవచ్చు.