MacBook Air 4: శక్తివంతమైన ల్యాప్‌టాప్‌ ఇండియా లాంచ్… మీరూ ఓ లుక్ వేయండి…

యాపిల్ నుంచి వచ్చిన తాజా మాక్‌బుక్ ఎయిర్ M4 (2025) ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యింది. పనిలో పర్ఫెక్ట్, బరువులో చాలా తక్కువగా ఉండే ఈ ల్యాప్‌టాప్ ఇప్పుడు యూఎస్‌లో చౌకగా దొరుకుతోంది. డిజైన్, స్పీడ్, బ్యాటరీ లైఫ్ అన్నీ చూసినప్పుడు ఇది ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్, ట్రావెలర్స్ అందరికీ సరిపోయే ల్యాప్‌టాప్.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

డిజైన్ మైనస్ బరువు ప్లస్ శక్తి

ఈ మాక్‌బుక్ లుక్ చూస్తేనే ప్రేమలో పడి పోతారు. చాలా స్లిమ్ గా ఉంటుంది. ఫ్యాన్ లేకుండా పనిచేస్తుంది కాబట్టి సైలెంట్ గా పనిచేస్తుంది. దీని బరువు చాలా తక్కువ. మీరు బ్యాగ్‌లో వేసుకున్నా తేలికగా తీసుకెళ్లొచ్చు. లుక్ సింపుల్ కానీ క్లాస్ ఉంటుంది. ఇది యాపిల్ గ్యారెంటీ.

పెర్ఫార్మెన్స్‌లో మాక్‌బుక్ ప్రో మాదిరిగానే

ఇది మాక్‌బుక్ ఎయిర్ అయినా పెర్ఫార్మెన్స్ మాత్రం మాక్‌బుక్ ప్రోకి సమానంగా ఉంటుంది. కొత్తగా వచ్చిన M4 చిప్ చాలా పవర్‌ఫుల్. ఇది 10-కోర్ CPU, 10-కోర్ GPU తో వస్తుంది. దీంతో మల్టీటాస్కింగ్, ఎడిటింగ్, వీడియో కాలింగ్, గేమింగ్ అన్నీ స్మూత్ గా జరుగుతాయి.

16GB RAM, 256GB SSD స్టోరేజ్‌తో వస్తుంది. దీనితో మీరు ఏ పని చేసినా హ్యాంగ్ అవదు. బిగ్ ఫైల్స్, వీడియోస్, సాఫ్ట్‌వేర్ అన్నీ వేగంగా ఓపెన్ అవుతాయి.

డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ – అన్నీ అదుర్స్

13.6 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే కలిగి ఉంటుంది. కళ్ళకు బాగా కనువిందు చేస్తుంది. వీడియో చూడటానికి, వర్క్ చేయటానికి పర్ఫెక్ట్. 12MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ‘సెంటర్ స్టేజ్’ ఫీచర్ వలన మీరు వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఫ్రేమ్ మధ్యలో ఉండేలా చేస్తుంది.

ఇంత శక్తివంతమైన ల్యాప్‌టాప్‌కు 18 గంటల వరకూ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అంటే మీరు డే ఫుల్ వర్క్ చేసినా ఛార్జ్ అవసరం లేకుండా ఉంటుంది. ట్రావెల్ చేసే వాళ్లకు ఇది గొప్ప ఫీచర్.

ఇండియాలో ధర ఎలా ఉంది?

ఇప్పుడు మాక్‌బుక్ ఎయిర్ M4 ఇండియాలో కూడా అమ్మకంలో ఉంది. అయితే యూఎస్‌తో పోలిస్తే కొంచెం ఖరీదు ఎక్కువ.

యూఎస్‌లో ఇది ఇప్పుడు $849 అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు ₹70,500కి దొరుకుతోంది. ఇది అసలైన లాంచ్ ధర అయిన $999 కన్నా తక్కువ. అంటే అక్కడ ఉన్నవాళ్లకు ఇది గొప్ప డీల్.

ఇండియాలో వేర్వేరు వెబ్‌సైట్లలో ధర ఇలా ఉంది –
అమెజాన్ ఇండియా: ₹89,900. ఐప్లానెట్: ₹93,906. రిలయన్స్ డిజిటల్: ₹1,07,900. జియోమార్ట్: ₹1,11,900. ధర కొంచెం ఎక్కువ అయినా ఇది పెట్టిన డబ్బుకు పూర్తిగా విలువ ఇస్తుంది. దీని పనితనం చూస్తే మీరు పెట్టిన ప్రతి రూపాయి Worth అని అనిపిస్తుంది.

వాల్లు ఏమంటున్నారు?

మాక్‌బుక్ ఎయిర్ M4 కోసం ఇప్పటికే చాలా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. చాలామంది ఇది ప్రో ల్యాప్‌టాప్ మాదిరిగా పనికొస్తుందంటున్నారు. స్పీడ్, డిస్‌ప్లే, బ్యాటరీ అన్నీ గొప్పగా ఉన్నాయని మెచ్చుకుంటున్నారు. దీని బరువు చాలా తక్కువ కావడం వలన స్టూడెంట్స్, ట్రావెలర్స్ దీనిపై ఫిదా అయిపోతున్నారు.

మీరు కొంటారా?

మీరు కొత్త ల్యాప్‌టాప్ కోసం వెతుకుతుంటే, మాక్‌బుక్ ఎయిర్ M4 మీ లిస్ట్‌లో ఉండాల్సిందే. యాపిల్ ప్రోడక్ట్స్ అంటే మీకు ఇష్టం అయితే ఇక వెనకడుగు వేయకండి. యూఎస్‌లో అయితే ఇది సూపర్ డీల్. ఇండియాలో కూడా ఇది బెస్ట్ ఆప్షన్. పెర్ఫార్మెన్స్, డిజైన్, బ్యాటరీ లైఫ్ అన్నింటిలోనూ ఇది టాప్ క్లాస్.

ఇలాంటి శక్తివంతమైన, స్లిమ్, స్టైలిష్ ల్యాప్‌టాప్‌ను మీ బడ్జెట్‌లో దొరికినప్పుడు మిస్ అవడం తగదు. ఇప్పుడే డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇలా చౌకగా దొరికే ఛాన్స్ మళ్లీ రావడం కష్టం..