Health tips: ఇందుకేనా రోజూ కడుపునొప్పి, గ్యాస్… పప్పులు, బాదం, బ్రౌన్ రైస్ అలా తింటున్నారా?

మన ఆరోగ్యం మన ఆహారంపైనే ఆధారపడుతుంది. అయితే మనం తినే ఆహారం ఎంత మంచిదైనా, దాన్ని తీసుకునే విధానం తప్పుగా ఉంటే ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం ఉండదు. రోజు వారి జీవితంలో మనం చాలా ముఖ్యమైన పదార్థాలను తినడం వలన బాగుపడతామని అనుకుంటాం. కానీ, వాటిని తినే పద్ధతి సరైనదిగా లేకపోతే అదే పదార్థాలు కడుపునొప్పి, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలకు కారణమవుతాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

వెంటనే మార్చాల్సిన ఆహారపు అలవాట్లు

మనలో చాలామంది పప్పులు, బాదం, బ్రౌన్ రైస్ వంటివి నానబెట్టకుండా తింటూ ఉంటారు. ఈ అలవాటు వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు పూర్తిగా శోషించబడవు. ఫలితంగా శరీరం సరిగా పని చేయదు. మీరు ఎప్పుడైనా అలసట, తలనొప్పి, గ్యాస్, తలతిరగడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారా? ఇవన్నీ పోషకాహార లోపాల కారణంగా రావచ్చు. అసలు మీరు తినే ఆహారం శరీరానికి ఉపయోగపడుతుందా? తినే పద్ధతిలో ఏదైనా తప్పు ఉందా? అన్నదాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

డాక్టర్ వరలక్ష్మి హెచ్చరిక – ఈ 3 పదార్థాల్ని ఇలా తినకండి

ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ వరలక్ష్మి చెబుతున్న వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె ప్రకారం, మనం తినే కొన్ని పదార్థాల్లో యాంటీ న్యూట్రియెంట్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను పూర్తిగా గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా మనం తినే మంచి ఆహారమే చివరికి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ విషయాన్ని మీరు ఇప్పటివరకూ పట్టించుకోకపోతే, ఇకపై తప్పకుండా పాటించాలి.

Related News

తినే ముందు నానబెట్టకపోతే ఏమవుతుంది?

ఉదయాన్నే నట్స్ తినే అలవాటు చాలామందికి ఉంది. బాదం, వాల్‌నట్స్ వంటి గింజలు ఆరోగ్యానికి మంచివే. కానీ వీటిని నానబెట్టకుండా తినటం శరీరానికి పెద్ద ప్రమాదమే. ఎందుకంటే ఈ గింజల పొరలో ఉండే ఫైటిక్ యాసిడ్ అనే పదార్థం ఐరన్, జింక్ వంటి ఖనిజాలతో కలిసిపోతుంది. వాటి శోషణను అడ్డుకుంటుంది. దీని వల్ల శరీరం అవసరమైన ఖనిజాలను తీసుకోలేకపోతుంది. కానీ ఈ గింజలను రాత్రి నానబెట్టి, ఉదయాన్నే తింటే, ఈ ఫైటిక్ యాసిడ్ తగ్గిపోతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. శరీరానికి మంచి పోషణ అందుతుంది.

బ్రౌన్ రైస్ తినే ముందు ఈ పని చేయకపోతే ముప్పే

చాలామందికి ఇప్పుడు హెల్తీ డైట్ అంటే బ్రౌన్ రైస్. కానీ దీన్ని వండే పద్ధతిలో పెద్ద తప్పు జరుగుతోంది. బ్రౌన్ రైస్ లో ఆర్సెనిక్ అనే హానికరమైన మూలకం ఉంటుంది. ఇది నేల నుండి పంటలకు చేరుతుంది. దీన్ని తినడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందుకే బ్రౌన్ రైస్ వండేముందు కనీసం 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టాలి. దీంతో ఆర్సెనిక్ ప్రభావం తగ్గుతుంది. బియ్యం హెల్తీగా మారుతుంది.

పప్పులను ఇలా వండితేనే ఆరోగ్యం బాగుంటుంది

పప్పులు మన ఆహారంలో ప్రతి రోజూ ఉండే అంశం. కానీ, వాటిని నానబెట్టకుండా నేరుగా వండితే గ్యాస్, కడుపునొప్పి, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే వీటిలో లెక్టిన్, ఫైటిక్ యాసిడ్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మందగిస్తాయి. అలాంటి పరిస్థితిలో ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. కాబట్టి పప్పులను కనీసం 8 గంటలపాటు నానబెట్టి వండాలి. రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు వండితే మంచిది. ఇది మాత్రమే కాకుండా, వండేటప్పుడు కొద్దిగా నిమ్మరసం కలిపితే రుచితో పాటు జీర్ణక్రియకు కూడా మంచిది.

ఇవి కూడా నానబెట్టి తినాలి – లేదంటే ఆరోగ్యానికి ముప్పే

బీన్స్, సీడ్స్, కూరగాయలు అన్నింటినీ కూడా సరైన రీతిలో తినాలి. బీన్స్ లో కూడా ఫైటిక్ యాసిడ్, లెక్టిన్స్ ఉంటాయి. ఇవి శరీరానికి ఉపయోగపడే పోషకాలను అడ్డుకుంటాయి. కనీసం 8 నుంచి 12 గంటలు బీన్స్ నానబెట్టాలి. అలాగే సీడ్స్‌ ను తినే ముందు 1 నుంచి 2 గంటల పాటు నానబెట్టాలి. ఇది ఫైటిక్ యాసిడ్ తగ్గిస్తుంది. పాలకూర, కాలే వంటి ఆకుకూరలను కూడా వండేముందు ఒకటి రెండు గంటలపాటు నీటిలో నానబెట్టి వండాలి. ఇలా చేయడం వల్ల ఆ ఆకుల్లో ఉండే హానికర పదార్థాలు తగ్గిపోతాయి.

అసలు సమస్య ఏంటంటే

మనకు శరీరంలో పోషకాలు అవసరం. కానీ అవి నేరుగా తీసుకుంటే మిగిలిపోతాయి. అర్థం కావడం లేదూ? అంటే… మీరు బాదం తింటున్నారని అనుకుందాం. కానీ నానబెట్టకుండా తింటే అది శరీరంలో ఐరన్‌ ను శోషించనివ్వదు. ఫలితంగా మీరు ఐరన్‌ తింటున్నా అది ఉపయోగపడదు. ఇదే విధంగా పప్పులూ, బ్రౌన్ రైస్‌ లో కూడా ఇదే విషయం వర్తిస్తుంది. అలా తీసుకునే ఆహారం వృథా అవుతుంది. పైగా సమస్యలకే కారణమవుతుంది.

తుది మాట

ఈరోజు నుంచే మీరు తినే ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పప్పులు, గింజలు, బియ్యం, బీన్స్ వంటి వాటిని నానబెట్టి వాడటం మొదలుపెట్టండి. ఇవే మీ ఆరోగ్యాన్ని రక్షించే మొదటి అడుగు అవుతాయి. ఒకవేళ మిమ్మల్ని తరచూ కడుపునొప్పి, గ్యాస్, అసిడిటీ బాధిస్తుంటే… దీన్ని తక్షణం మార్చండి. పద్ధతి తప్పితే మంచి ఆహారమే విషంగా మారొచ్చు. ఎప్పుడు చూసినా ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాట నిజమే!

ఇంకా ఏం ఆలస్యం? ఈ మూడు పదార్థాలను నానబెట్టి తినడం ఈ రోజే మొదలుపెట్టు… ఆరోగ్యంగా జీవించు!