ఏపీలో ఉద్యోగుల సాధారణ బదిలీలను ఈ నెలలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో ఉపాధ్యాయులు మినహా మిగతా ఉద్యోగుల సాధారణ బదిలీలను మే నెలలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బదిలీలకు సంబంధించిన ఫైలు ఇప్పటికే సిద్ధంగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తర్వాత బదిలీలు చేపడతామని సమాచారం. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముందుగా హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేస్తారు. అది పూర్తయిన తర్వాత బదిలీలు చేపడతారు. ఉపాధ్యాయ బదిలీలకు ప్రత్యేక బదిలీ చట్టం చేశారు.
ఈ చట్టంపై కొంతమంది కోర్టుకు వెళ్లడంతో కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ ఈ నెల 10న విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రత్యేక అవసరాలు ఉన్న ఉపాధ్యాయులు బదిలీల కోసం మెడికల్ సర్టిఫికెట్లు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.
Related News
అయితే, ప్రిఫరెన్షియల్ కేటగిరీలో బదిలీ విధానాలు సరిగ్గా లేవని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. బదిలీలలో వారికి ఇచ్చే ప్రాధాన్యత తగ్గించబడిందని వారు చెబుతున్నారు. దీనిని సరిచేయాలని కోరుతూ కొంతమంది ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఉపాధ్యాయ బదిలీల అంశంపై జూన్ 15 వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీనివల్ల ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఆలస్యం అవుతుండగా, మిగిలిన ఉద్యోగుల బదిలీలను కూడా ఈ నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.