Government: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..ఆ ఉద్యోగులందరికీ తీపి వార్త..!!

రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ చూపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే విద్యావ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చారు. ఈ సమయంలో, ఇంటర్మీడియట్ విద్యలో పనిచేస్తున్న 3,572 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్వీస్‌ను వచ్చే విద్యా సంవత్సరానికి జూన్ 1 నుండి ఏప్రిల్ 30, 2026 వరకు పునరుద్ధరించారు. ఈ మేరకు పాఠశాల విద్యా కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇంతలో, ఏపీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ జీతాలను పెంచాలని సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జీతాల పెంపును సంకీర్ణ ప్రభుత్వం ఆమోదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, గంటకు రూ.150, నెలకు గరిష్టంగా రూ.10,000 చెల్లించాలనే నిబంధన ఉంది.

ఈ క్రమంలో, ప్రభుత్వం నెలకు గరిష్టంగా రూ.27,000 గంటకు గరిష్టంగా రూ.375 చొప్పున ఆమోదించింది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా గెస్ట్ ఫ్యాకల్టీ జీతాల పెంపును డిమాండ్ చేస్తున్నారని, కానీ గత ప్రభుత్వం దానిని పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. వారి సమస్యను గుర్తించిన సంకీర్ణ ప్రభుత్వం జీతాలను పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం.

Related News