మనలో చాలామందికి దేశంలో లేదా విదేశాల్లో త్వరగా చేరుకోవాలంటే ఫ్లైట్ ప్రయాణమే మొదటి ఆలోచన. కానీ విమాన ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకున్నదనే భావన కూడా చాలా మందిలో ఉంది. టిక్కెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో అందరికి ఫ్లైట్ ట్రావెల్ సాధ్యపడదు. అయితే మీరింకా అలాంటి ధరకే టిక్కెట్లు తీసుకుంటున్నారా? ఇకపై అవసరం లేదు.
ఈ కథనంలో మీకు చీప్ టిక్కెట్లు ఎప్పుడొస్తాయో, ఎలా బుక్ చేయాలో, ఏ రోజుల్లో బుక్ చేస్తే తక్కువ ఖర్చులో ప్రయాణించవచ్చో పూర్తిగా వివరంగా తెలుపబోతున్నాం.
ఫ్లైట్ టిక్కెట్ల ధరలు ఎలా చెక్ చేయాలి?
మీరే ఎప్పటికప్పుడు టిక్కెట్ల ధరలపై కళ్లేసి ఉంచాలంటే ‘ఫేర్ కంపారిజన్ టూల్స్’ను తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇవి గూగుల్ Flights, Skyscanner, MakeMyTrip, Cleartrip లాంటివి. మీరు బుక్ చేయాలనుకున్న తేదీలకు, నగరాలకు ఏయే విమానాలు ఉన్నాయి, వాటి ధరలు ఎలా మారుతున్నాయి అన్నది ఈ టూల్స్ ద్వారా మీకు సులభంగా అర్థమవుతుంది. ఇంకా మంచి సదుపాయం ఏమిటంటే మీరు ప్రైస్ అలర్ట్ పెట్టొచ్చు. అంటే ధర తక్కువయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వెంటనే బుక్ చేయొచ్చు.
రివార్డ్ కార్డులతో డిస్కౌంట్ పొందండి
మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటే దాని ద్వారా బుక్ చేయడం మంచిది. ముఖ్యంగా రివార్డ్స్ లేదా ట్రావెల్ బేస్డ్ క్రెడిట్ కార్డులు ఉంటే వాటి పాయింట్స్‌తో టిక్కెట్ ఖర్చు తక్కువవుతుంది. కొన్ని బ్యాంకులు ప్రత్యేకంగా ట్రావెల్ కార్డులు ఇస్తున్నాయి, వాటిని ఉపయోగించండి. అంతేకాకుండా, కొన్ని కార్డులు ఎయిర్ మైళ్స్ కూడా ఇస్తాయి. అలా మీరు సవాలక్ష రూపాయల టిక్కెట్‌ను అర్ధ ధరకు కూడా పొందవచ్చు.
ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేయడానికి సరైన సమయం ఏంటి?
చాలామంది టిక్కెట్ తొందరగా బుక్ చేస్తే చీప్‌గా దొరుకుతుందని అనుకుంటారు. కానీ నిజానికి ఒక టిక్కెట్‌ను చాలా ముందుగా అంటే ఐదు నెలల కంటే ముందే బుక్ చేస్తే ఆ ధర ఎక్కువే ఉంటుంది. అదే ఒక టిక్కెట్‌ను ప్రయాణానికి 28 రోజుల ముందు బుక్ చేస్తే చీప్‌గా దొరుకుతుంది. అంటే మీరు ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచి ధరకు టిక్కెట్ దొరుకుతుంది.
మరోవైపు చివరి నిమిషంలో టిక్కెట్ బుక్ చేస్తే ధర రెట్టింపు అయిపోతుంది. ప్రయాణానికి ముందు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు టిక్కెట్ తీసుకుంటే, చాలా ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. పండగలు, సెలవు రోజులు, ఫెస్టివల్ సీజన్ వంటి సమయాల్లో టిక్కెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో బుక్ చేయడం తప్పు.
ఎప్పుడు బుక్ చేస్తే చీప్ టిక్కెట్లు దొరుకుతాయి?
ఇది చాలా మందికి తెలియని విషయం. చాలా రిపోర్ట్స్ ప్రకారం సోమవారం, మంగళవారం, బుధవారం లాంటి వారంలో మధ్య రోజుల్లో టిక్కెట్లు చీప్‌గా దొరుకుతాయి. వీటి ధర శుక్రవారం, శనివారం, ఆదివారాలకంటే తక్కువగా ఉంటుంది. వీకెండ్ సమయాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో టిక్కెట్లు ఖరీదుగా ఉంటాయి. అందుకే మీ ట్రిప్‌ను వీకెండ్‌కు కాకుండా మిడ్ వీక్కి ప్లాన్ చేయండి.
చివరగా మీకు ఒక ముఖ్యమైన సూచన
మీరు ఎప్పుడైనా ప్రయాణానికి ముందే ప్లాన్ చేయాలి. చివరి నిమిషంలో నిర్ణయించుకుంటే టిక్కెట్లు మాత్రమే కాదు, హోటల్ బుకింగ్స్, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఎక్కువవుతాయి. టిక్కెట్ బుక్ చేసేటప్పుడు ఐదు మోడ్లలో ఆలోచించాలి. ఏరోజు వెళ్లాలి, ఎంత ఖర్చవుతుంది, ఏ విమాన సంస్థలు అందుబాటులో ఉన్నాయి, ఎప్పుడైతే డిస్కౌంట్ వస్తుంది, ఇంకొకటి – ట్రావెల్ డేట్‌కి ముందు మీకు మరో అవసరం వస్తుందా అన్నదీ ముందే ఆలోచించాలి.
ఈ రూల్స్ పాటిస్తే మీరు కూడా చీప్ టిక్కెట్లతో విమాన ప్రయాణం చేయవచ్చు. ఇక నుంచి మీ ట్రిప్‌లు ఖరీదైనవిగా కాకుండా మజా ఫుల్‌గా మారిపోతాయి. మీరు కూడా ఎక్కడికైనా త్వరగా చేరాలని అనుకుంటే, ఈ టిప్స్‌ను ఫాలో అవుతూ చీప్ ఫ్లైట్ టిక్కెట్లను సొంతం చేసుకోండి.
మీ తర్వాతి ట్రిప్‌ను ఇప్పుడే ప్రణాళిక చేసేయండి. ఆలస్యం చేస్తే టిక్కెట్ ధరలు డబుల్ అవుతాయ్.