ఆయుష్ మాత్రే: క్రికెట్ ప్రపంచంలో ఈ యువకుడి పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. కేవలం 17 ఏళ్ల వయసులోనే అతను చిచ్చర పిడుగులా ఆడిన తీరు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ యువ టాలెంట్ పై క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ యొక్క యంగ్ స్టార్ ఆయుష్ మాత్రే తన తుఫాన్ ఇన్నింగ్స్తో ఒక్క రాత్రిలో స్టార్గా మారాడు. అనుభవజ్ఞులైన బౌలర్లను కూడా ఈ టీనేజర్ ఎలా ఎదుర్కొన్నాడో చూస్తే నమ్మకం కాదు. ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ లాగా క్లాస్ బ్యాటింగ్ చేసి, ఫోర్లు, సిక్సులతో బౌలర్లను ఛీఛీలాడించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఆయుష్ మాత్రే తన విశ్వరూపం చూపించాడు. ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోస్తూ, కేవలం 48 బంతుల్లో 94 పరుగులు చేసాడు. అతని ఇన్నింగ్స్లో 5 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. భువనేశ్వర్ కుమార్ వేసిన ఒక ఓవర్లో 26 పరుగులు చేయడం ఆ మ్యాచ్ హైలైట్. ఈ చిన్న వయసులోనే అంత పెద్ద ఇన్నింగ్స్ ఆడిన మాత్రేపై ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. అతని స్ట్రోక్ ప్లే, క్లాసికల్ టెక్నిక్ అందర్నీ ముగ్ధులను చేసాయి.
Related News
RCB మ్యాచ్లో ఆయుష్ మాత్రే భువనేశ్వర్ కుమార్ మీద వరుసగా 4,4,4,6,4,4 బాదాడు. ఒక్క ఓవర్లో 26 పరుగులు చేసి, ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ అయిన భువనేశ్వర్ ను షాక్ లోకి తీసుకువెళ్లాడు. ఇంత పెద్ద బౌలర్ ను ఎదుర్కొని ఇలా ధైర్యంగా ఆడగలిగాడంటే, మాత్రే టాలెంట్ గురించి ఇక అదనపు మాటల అవసరం లేదు.
ఈ సీజన్లో సిఎస్కే టీమ్ విఫలమైనప్పటికీ, మాత్రే ప్రదర్శన శాశ్వతంగా నిలిచిపోయింది. ఒత్తిడి పరిస్థితుల్లో కూడా స్టేబుల్ గా ఆడగలిగిన మెచ్యూరిటీ, అతని టెక్నిక్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ముంబైలోని ఐకానిక్ ఓవల్ మైదానంలో లెక్కలేనన్ని గంటలు ప్రాక్టీస్ చేసుకున్న అతని కష్టం ఇప్పుడు ఫలిస్తోంది.
మొదట్లో రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మాత్రే ఎంపికైనప్పుడు అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. గుజరాత్ నుంచి ఉర్విల్ పటేల్, కేరళ నుంచి సల్మాన్ నిజార్ వంటి ప్రతిభావంతులతో పోటీ ఉండగా, ఐపీఎల్ కు ముందు జట్టు నెట్స్ లో మాత్రేని గమనించిన ధోని మరియు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అతని సామర్థ్యాలపై ఎటువంటి సందేహాలు వ్యక్తం చేయలేదు. ఇప్పుడు మాత్రే తన ప్రతిభతో ఆ నమ్మకాన్ని సార్థకం చేశాడు.
ఈ ఐపీఎల్ టీనేజ్ ప్రతిభకు వేదికగా మారింది. కొన్ని రోజుల క్రితం 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన మొదటి బంతినే సిక్స్ గా కొట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ కొత్త భారతీయ ప్రతిభను ప్రత్యేకం చేసేది కేవలం టెక్నిక్ లేదా టైమింగ్ మాత్రమే కాదు – ధైర్యం, ఆకలి, ఎప్పుడూ ఆగని స్పిరిట్. మాత్రే ఎప్పుడూ వెనుకాడలేదు, నిరంతరం దృఢ నిశ్చయంతో బ్యాటింగ్ చేశాడు.
సురేష్ రైనా మాత్రేని భారతదేశపు గొప్ప ఆటగాళ్లలో ఒకరితో పోల్చాడు: “అతని పాదాల స్థానం, హెడ్ పొజిషన్ చూడండి. వీరేందర్ సెహ్వాగ్ కూడా ఇలాంటి సెటప్ తోనే ఆడేవాడు. చాలా స్టిల్ హెడ్, క్రీజ్ లో స్టేబిలిటీ – ఇది అతని ప్రత్యేకత!”
భారత మాజీ కోచ్ రవి శాస్త్రి కూడా మాత్రే ప్రతిభను ప్రశంసిస్తూ, *”ఆయుష్ మాత్రే షాట్ సెలెక్షన్ అద్భుతం. స్టార్-ప్యాక్డ్ ముంబై ఇండియన్స్ బౌలింగ్ ను 17 ఏళ్ల యువకుడు ఎలా హ్యాండల్ చేశాడో చూస్తే అది అందరి దృష్టిని ఆకర్షించింది. అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉంది!”* అని పేర్కొన్నారు.