SUMMER: : భగ్గుమంటున్న ఎండలు.. తెలంగాణలో ఈ జిల్లాకు రెడ్‌ అలర్ట్‌..

తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న వేడిగాలుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాకు హెచ్చరిక జారీ చేస్తున్నారు. గురువారం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆదిలాబాద్ పోలీస్ జిల్లాలో అత్యధికంగా 45.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదిలాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. గురువారం ఆదిలాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలుస్తోంది.

ఆదిలాబాద్ జిల్లా మినహా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గాలిలో తేమ తగ్గడం, వేడి గాలుల కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే, రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.

Related News

ఇదిలా ఉండగా, గత రెండు రోజులుగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఉదయం నుంచి భానుడు నగరవాసుల మీద తన విశ్వరూపాన్ని చూపించగా, సాయంత్రం చల్లటి వాతావరణంతో వరుణుడు వారికి ఉపశమనం కలిగించాడు. బుధవారం నుంచి గురువారం మధ్య హైదరాబాద్ సహా కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే వారాల్లో కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.