ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గత నెలలో మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 15 వరకు దరఖాస్తులు కొనసాగుతాయి. ఈ క్రమంలో, ఇటీవలే సంకీర్ణ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా డీఎస్సీ నోటిఫికేషన్ కింద స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు కేటాయించినట్లు క్రీడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో తగిన విద్యార్హతలు ఉన్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన వెల్లడించారు. మెగా డీఎస్సీలో భాగంగా బుధవారం (ఏప్రిల్ 30) విజయవాడలోని షాప్ కార్యాలయంలో మంత్రి స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన క్రీడాకారులు స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు శుక్రవారం (మే 2) నుండి ప్రారంభమవుతాయి. మే 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం 30 రోజుల పాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత క్రీడా రంగంలో మెరిట్ మరియు సీనియారిటీ ఆధారంగా ఈ పోస్టులను కేటాయిస్తామని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని పోస్టుల వివరాలు సంస్థల వారీగా ఇలా ఉన్నాయి.
ఎంపీపీ, జెడ్‌పీపీ పాఠశాలల్లో పోస్టుల సంఖ్య: 333
మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలల్లో పోస్టుల సంఖ్య: 30
ఆశ్రమ పాఠశాలల్లో పోస్టుల సంఖ్య: 22
గురుకుల పాఠశాలల్లో పోస్టుల సంఖ్య: 2
మోడల్ పాఠశాలల్లో పోస్టుల సంఖ్య: 4
సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో పోస్టుల సంఖ్య: 7
గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పోస్టుల సంఖ్య: 23
Related News
జిల్లాల వారీగా స్పోర్ట్స్ కోటా పోస్టుల వివరాలు..
కర్నూలు జిల్లా: 73
చిత్తూరు జిల్లా: 41
తూర్పు గోదావరి జిల్లా: 38
కృష్ణా జిల్లా: 34
గుంటూరు జిల్లా: 33
విశాఖపట్నం జిల్లా: 32
పశ్చిమ గోదావరి జిల్లా: 29
అనంతపురం జిల్లా: 22
వైఎస్ఆర్ జిల్లా: 20
ప్రకాశం జిల్లా: 20
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: 17
శ్రీకాకుళం జిల్లా: 16
విజయనగరం జిల్లా: 10
జోన్ల వారీగా పోస్టులు..
జోన్-1లో 6 పోస్టులు జోన్-2లో 6 పోస్టులు జోన్-3లో 11 పోస్టులు జోన్-4లో 11 పోస్టులు రాష్ట్ర స్థాయిలో 2 పోస్టులు