తెలంగాణ రాష్ట్రంలోని బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (TS BSE) ఈరోజు ఏప్రిల్ 30, 2025న పదో తరగతి ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. ఈ సంవత్సరం మొత్తం 5,09,403 విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2,58,895 మంది బాలురు మరియు 2,50,508 మంది బాలికలు ఉన్నారు. పరీక్షలు మార్చి 21 నుండి ఏప్రిల్ 4, 2025 వరకు నిర్వహించబడ్డాయి.
వెబ్‌సైట్ క్రాష్ అవుతున్నా ఫలితాలు పొందే మార్గాలు
ఫలితాలు విడుదల అయిన వెంటనే ప్రభుత్వ వెబ్‌సైట్లు బాగా ట్రాఫిక్‌తో క్రాష్ అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు విద్యార్థులు ఈ క్రింది మార్గాల్లో తమ ఫలితాలను తెలుసుకోవచ్చు:
1. అధికారిక వెబ్‌సైట్లు
విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి ఫలితాలను ఈ వెబ్‌సైట్లలో పొందొచ్చు: [bse.telangana.gov.in], [bseresults.telangana.gov.in], [results.bse.telangana.gov.in], [results.bsetelangana.org]
Related News
2. మన మిత్ర WhatsApp ద్వారా ఫలితాలు
వెబ్‌సైట్లు పని చేయకపోతే, విద్యార్థులు మన మిత్ర WhatsApp నెంబర్ ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు. మీరు మీ హాల్ టికెట్ నంబర్ పంపితే వెంటనే ఫలితాలు పంపిస్తారు.
3. Leap App ద్వారా
విద్యార్థులు Leap App ని డౌన్లోడ్ చేసి, తమ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి ఫలితాలను పొందొచ్చు. ఈ యాప్‌లో ఫలితాలను పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది.
4. DigiLocker ద్వారా ఫలితాలు
DigiLocker ద్వారా ఫలితాలు ఇలా పొందవచ్చు:
1. DigiLocker యాప్ డౌన్లోడ్ చేసి Aadhaar నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
2. “Pull Partner Documents” సెక్షన్‌లోకి వెళ్లి TS BSE Board ఎంపిక చేయాలి.
3. “TS SSC Class 10th Marksheet 2025” ఎంపిక చేసి, హాల్ టికెట్ నంబర్ మరియు సంవత్సరం ఎంటర్ చేసి “Get Document” క్లిక్ చేయాలి.
4. ఫలితాన్ని మీ locker లో save చేసుకోవచ్చు.
5. SMS ద్వారా ఫలితాలు పొందడం ఎలా?
మీ ఫోన్‌లో SMS ట్యాబ్ ఓపెన్ చేసి ఈ విధంగా టైప్ చేయండి:
TS10 (హాల్ టికెట్ నంబర్)
అందిన మెసేజ్‌ను 56263 నెంబర్‌కు పంపండి.
మీ ఫలితాలు SMS రూపంలో మీ ఫోన్‌కు వస్తాయి.
6. Jagran Josh వెబ్‌సైట్ ద్వారా
వెబ్‌సైట్లు పని చేయకపోతే, Jagran Josh వెబ్‌సైట్ ([jagranjosh.com/result) ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు. హాల్ టికెట్ నంబర్ ఇవ్వగానే ఫలితాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మార్క్ షీట్‌లో ఉన్న వివరాలు
TS SSC ఫలితాల మార్క్స్ మెమోలో ఈ సమాచారం ఉంటుంది: విద్యార్థి పేరు, రోల్ నంబర్, జిల్లా పేరు. ప్రతి సబ్జెక్ట్‌కు గ్రేడ్‌లు (A1 నుండి F). సాధించిన మార్కులు మరియు మొత్తం మార్కులు. CGPA మరియు గ్రేడ్ పాయింట్లు. ఫలిత స్థితి (Pass/Fail). సప్లిమెంటరీ అర్హత ఉంటే అది కూడా చూపుతుంది
పాస్ మార్కులు మరియు తదుపరి అడుగులు
విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్‌లో 35 మార్కులు (రెండవ భాషలో 20 మార్కులు) సాధించాలి. ఫలితాల్లో పాస్ అయితే వారు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం (1st year) లో ప్రవేశం పొందుతారు. ఫెయిలయిన వారు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావాలి.
గత ఏడాది ఫలితాలు – జిల్లాల ప్రదర్శన
2024లో నిర్మల్ జిల్లా అత్యుత్తమ ప్రదర్శనతో 99.05% పాస్ రేట్ సాధించింది. బాలికల పాస్ శాతం 93.23%, బాలుర పాస్ శాతం 89.92% గా ఉండింది.
మీ ఫలితాలను తెలుసుకోవడంలో ఇబ్బంది ఉంటే, పై పద్ధతుల్లో ఏదైనా ఉపయోగించండి.