భారతదేశంలో ఎప్పుడూ బడ్జెట్ కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అందులో కూడా SUVలకు ప్రాముఖ్యత మరింత ఎక్కువ. అందుకే టాటా పంచ్, మారుతి బ్రెజా, మహీంద్రా XUV 3XO లాంటి కార్లు మార్కెట్‌లో బెస్ట్ సెల్లర్స్‌గా నిలుస్తున్నాయి. ఈ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకొని పెద్ద పెద్ద కంపెనీలు కొత్తగా 5 SUVలు విడుదల చేయడానికి రెడీగా ఉన్నాయ్. ఇవన్నీ కూడా ₹10 లక్షల లోపు ధరలో అందుబాటులోకి రాబోతున్నాయి.
మీ బడ్జెట్ తక్కువగా ఉన్నా స్టయిల్‌గా ఉండే, సేఫ్‌గా ఉండే, ఫీచర్లతో నిండిన SUV కొనాలనుకుంటే… ఈ కొత్త మోడళ్లు మీ కోసమే.
మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్
ఈ లిస్ట్‌లో మొదటిది మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్. ఇది హైబ్రిడ్ ఇంజిన్‌తో వస్తుంది. అంటే పెట్రోల్‌తో పాటు ఎలక్ట్రిక్ పవర్‌తో కూడా నడుస్తుంది. కంపెనీ దీన్ని ₹10 లక్షల లోపు ధరలోనే తీసుకురానుంది. దీని Mileage దాదాపు 30 కి.మీ. పర్ లీటర్ దాటుతుంది. కొత్తగా వచ్చే ఫ్రాంక్స్ మోడల్‌లో 6 ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్ లాంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా ఉంటాయి. ఈ ఇంజిన్‌ను తరువాత బాలెనో, డిజైర్ లాంటి మోడల్స్‌లో కూడా వాడే అవకాశముంది. మీకు fuel economy ఇష్టం అయితే ఇది బెస్ట్ ఎంపిక.
2025 హ్యుందాయ్ వెన్యూ
ఇంకొన్ని నెలల్లో హ్యుందాయ్ కొత్త వెన్యూ మార్కెట్‌లోకి తీసుకురానుంది. దీని డిజైన్ హ్యుందాయ్ క్రెటా, ఆల్కాజార్ లాంటి SUVల్ని గుర్తుచేస్తుంది. ₹10 లక్షల లోపు ఈ SUV విడుదల కానుంది. ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ వేరియంట్స్ ఉంటాయి. Mileage సుమారు 23.4 కి.మీ వరకు ఉంటుంది. కొత్త వెన్యూలో ADAS లెవెల్ 2 ఫీచర్ కూడా వచ్చే అవకాశం ఉంది. సేఫ్టీ, స్టయిల్, టెక్నాలజీ మిక్స్ కావాలని చూస్తున్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్
దేశంలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న చీపెస్ట్ SUV అంటే టాటా పంచ్. ఇప్పుడు దీన్ని కొత్త డిజైన్‌తో టాటా తీసుకురానుంది. ఈ facelift మోడల్ ధర కూడా ₹10 లక్షల లోపే ఉంటుంది. ఇందులో డిజైన్ మార్పులు మాత్రమే ఉంటాయి. మెకానికల్‌గా చూస్తే ఇదే 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌నే వాడతారు. CNG ఆప్షన్‌లోనూ ఇది వస్తుంది. స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్స్, కొత్త టచ్‌స్క్రీన్, కనెక్టెడ్ ఫీచర్లు కూడా ఉంటాయి. సేఫ్టీ, బడ్జెట్ ఇద్దర్నీ చూస్తే ఈ SUV చాలా బావుంటుంది.
మహీంద్రా XUV 3XO EV
ఇలాంటిదే కానీ ఎలక్ట్రిక్ వెర్షన్ కావాలా? మహీంద్రా నుంచి XUV 3XO EV అనే కొత్త ఎలక్ట్రిక్ SUV రాబోతుంది. ఇది XUV400 కన్నా చీప్ మోడల్. దీని ధర కూడా ₹10 లక్షల దగ్గరే ఉంటుంది. ఫుల్ చార్జ్‌పై 400-450 కి.మీ రేంజ్ ఇవ్వగలదని అంచనా. టాటా నెక్సాన్ EV, సిట్రోయెన్ eC3 లాంటి మోడల్స్‌కు పోటీగా రాబోతున్న ఇది, ఎవరికైనా లో-కాస్ట్ లో EV కొనాలని ఉంటే బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
రెనో కైగర్ ఫేస్‌లిఫ్ట్
చివరగా రేనో నుంచి వస్తున్న కైగర్ ఫేస్‌లిఫ్ట్. ఇది ఇప్పటికే రోడ్డుపై టెస్టింగ్ సమయంలో పలుసార్లు కనిపించింది. దీని ధర కూడా ₹10 లక్షల లోపే ఉంటుంది. ఇందులో డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లలో మార్పులు ఉంటాయి. మెకానికల్‌గా మాత్రం 1.0 లీటర్ నాచురల్ అస్‌పైర్డ్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు ఉంటాయి. CNG వేరియంట్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. నిస్సాన్ మ్యాగ్నైట్‌కి పోటీగా ఇది మార్కెట్‌లోకి రాబోతోంది.
ఈ కొత్త SUVలు రూ.10 లక్షల లోపు ధరల్లో మార్కెట్‌ను దున్నేందుకు రెడీ అవుతున్నాయి. మీరు బడ్జెట్‌కి తగ్గట్టు స్టయిలిష్, సేఫ్ SUV కొట్టాలంటే ఈ లిస్టులో మీ ఫేవరెట్ వాహనం ఏదో ఫిక్స్ చేసుకోండి! లేదంటే తరువాత మాత్రం వెనకబడిపోతారు!